- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పతనం స్టార్టయ్యింది.. టీఆర్ఎస్ నేతలకు అల్వాల్ రెడ్డి వార్నింగ్
దిశ, జడ్చర్ల: టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం స్టార్టయ్యింది, ఇక భవిష్యత్ మా పార్టీదే అని కాంగ్రెస్ నేత అల్వాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ గుండాలను రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి ఉసిగొలిపి భయపెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి దాడులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడేవాళ్లు కాదని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని, ఇక భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి.. లేకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయిలు, రామ్ గౌడ్, అశోక్, మధు, శంకర్ నాయక్, హరి గౌడ్, జహీర్, అంజిరెడ్డి, పర్వతాలు, ఉస్మాన్, వెంకటయ్య, బాలస్వామి, బీరయ్య, శివ, శివ గౌడ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.