- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూత్ పోలీస్ : హారర్ కామెడీలో జాక్వెలిన్ హాట్ లుక్స్
దిశ, సినిమా : సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న బాలీవుడ్ మూవీ ‘భూత్ పోలీస్’. వీరికి జంటగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల కిందట సైఫ్, అర్జున్‌లతో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. లేటెస్ట్‌గా జాక్వెలిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన శ్రీలంకన్ యాక్ట్రెస్.. హాట్ లుక్స్‌తో హీటెక్కించింది. డెనిమ్ జీన్స్, వైట్ క్రాప్ టాప్‌తో వింటర్ జాకెట్ ధరించిన ఈ ఫార్మర్ మోడల్.. చేతిలో కొరడా, మిస్టీరియస్ కళ్లతో అందరి అటెన్షన్ క్యాచ్ చేసింది. ఇక ఈ పిక్‌కు ‘మొరటుగా ఉన్నవారికి మృదువైన భాష అర్థం కాదు! భూత్ పోలీస్‌లో అద్భుతమైన కనికను కలుసుకోండి’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసిన జాక్వెలిన్.. డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా త్వరలోనే మీ ముందుకు రానుంది’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. ఈ సినిమాలో సైఫ్ ‘విభూతి’ అనే క్యారెక్టర్‌లో నటిస్తుండగా, అర్జున్ చిరాంజి పాత్రలో కనిపించనున్నాడు. పవన్ కిర్పాలని డైరెక్షన్‌లో వస్తున్న చిత్రాన్ని జయ తౌరాని నిర్మిస్తున్నారు.