ప్రధాని మోదీకి ఇవాంక ట్రంప్ కృతజ్ఞతలు

by vinod kumar |   ( Updated:2020-03-31 21:58:01.0  )
ప్రధాని మోదీకి ఇవాంక ట్రంప్ కృతజ్ఞతలు
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని మోదీ ట్విట్లర్లో యోగనిద్ర వీడియోను షేర్ చేయగా దాన్ని వీక్షించిన ఇవాంక అద్బుతమని ప్రశంసించారు. ఇంత మంచి వీడియోను అందించినందుకు ఆమె ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నాకు తీరిక దొరికినప్పుడల్లా వారానికి ఒకటికి రెండు సార్లు యోగనిద్ర ప్రాక్టీస్ చేస్తానని మోడీ తెలిపారు. ఆరోగ్యంగా ఉండటం కోసం, మనస్సు రిలాక్స్ కావటానికి, ఒత్తిడి తగ్గడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి మోదీ ఈ వీడియో షేర్ చేశారు.


tags;pm modi,ivanka trump,thanks,video share,twitter

Next Story