- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పన్నుఆదాయ పెంపు మార్గాలపై కేంద్ర అన్వేషణ!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం బాగా క్షీణించింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదాయపన్ను విభాగంలోని దాదాపు యాభై మంది ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్(ఐఆర్ఎస్) అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు అవసరమైన సూచనలు చేశారు. ముఖ్యంగా పన్ను ఆదాయం భవిష్యత్తుల్లో కొన్నేళ్లపాటు తగ్గనుందని ఐటీ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పన్ను ఆదాయాన్ని పెంచేందుకు ఐటీ విభాగం కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఫోర్స్(FORCE) పేరుతో కొత్త టీమ్ ఇదే అంశంపై చర్చిస్తోంది. ప్రజల నుంచి తగిన రీతిలో పన్నులెలా రాబట్టాలి? ఇప్పటికే ఉన్న మార్గాలకు తోడు కొత్త మార్గాలేంటి? కొవిడ్-19 వల్ల లాభపడే సంస్థలేవి? ఆయా సంస్థల నుంచి వీలైనంత పన్నును ఎలా లాంటి అంశాల్ని ఈ బృందం పరిశీలించనుంది. ఈ బృందం చేసే ప్రతిపాదనల్లో కొన్ని సంవత్సరంలోపు పన్ను వసూలు చేయగలిగినవి కాగా, కొన్ని ఆరు నెలల్లోనే పన్ను వసూలు చేయగలిగేవి. ఫోర్స్ టీమ్ ప్రభుత్వం ముందుంచిన ఆ ప్రతిపాదనలేంటో తెలుసుకుందాం!
సంపన్నులపై పన్ను విధించడం…
సంపన్నుపై అధిక పన్ను విధానాన్ని అధికారు ప్రతిపాదించారు. సూపర్ రిచ్‌లపై సర్‌ఛార్జ్‌ని ఇటీవల కేంద్ర బడ్జెట్ 2020-21లో పెంచడం జరిగింది. అవి ఖజానాకు రూ. 2,700 కోట్లు మాత్రమే వసూలు చేస్తాయన్ని, ఈ విభాగానికి రెండు ప్రత్యామ్నాయాల్లో పన్ను విధించాలని వారు ప్రతిపాదన పెట్టారు. ఈ రెండింటినీ పరిమిత, నిర్ణీత కాలానికి విధించవచ్చు. అందులో ఒకటి, పన్ను శ్లాబ్‌ను గరిష్టంగా 40 శాతం పెంచాలని, రెండోది.. రూ. 5 కోట్ల నికర సంపద ఉన్నవారికి సంపద పన్నును తిరిగి ప్రవేశ పెట్టడం.
విదేశీ కంపెనీల ఆదాయం :
విదేశీ సంస్థలు తమ భారతీయ శాఖ కార్యాలయాలు, శాశ్వత సంస్థల నుండి సంపాదించిన ఆదాయంపై చెల్లించే సర్‌చార్జిని పెంచాలనే సిఫారసు కూడా ఉంది. ప్రస్తుతం, నికర ఆదాయం రూ. కోటి నుంచి రూ.10 కోట్ల పరిధిలో ఉంటే 2 శాతం సర్‌ఛార్జి, రూ.10 కోట్లకు మించిన ఆదాయంపై 5 శాతం సర్‌ఛార్జ్ విధించాలనేది ఈ పరిపాదన.
కొవిడ్-19 రిలీఫ్ సెస్ :
పన్ను చెల్లించే ప్రతి ఒక్కరిపై కొవిడ్ రిలీఫ్ సెస్ విధించాలనేది ఇంకో ప్రతిపాదన. ప్రస్తుతం హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ 2 శాతంగా ఉంది. అదనంగా వన్‌టైమ్ పేరుతో 4 శాతం కొవిడ్ రిలీఫ్ సెస్ విధించాలన్నారు. వార్షికాదాయం రూ. 10 లక్షలు దాటిన వారిపై ఈ పన్ను విధించడం ద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు.
కొవిడ్ ఉపశమనం కోసం CSR నిధుల సమీకరణ:
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) ఉపయోగించాలని అధికారులు సూచించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దీన్ని వినియోగించాలని తెలిపారు.
న్యూ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్…
కరోనా వైరస్ ఉపశమనం కోసం నిధులను సమీకరించడానికి కొత్త పన్ను పొదుపు పథకాన్ని రూపొందించాలని అధికారులు సూచించారు. ప్రత్యేక విధానం ద్వారా పొదుపు చేసిన సొమ్మును ఐదేళ్ల పాటు సేవింగ్‌లో ఉంచి అధిక వడ్డీ వచ్చేలా చేయాలనేది అధికారుల అభిప్రాయం.
కొత్త రుణమాఫీ పథకం:
వివాద్ సే విశ్వాస్ పథకం లాంటిదే ఇంకొక పథకాన్ని ప్రవేశ పెట్టాలనేది అధికారుల సూచన. దీనిద్వారా పెనాల్టిలతో సొమ్ముని రాబట్టుకోవాలంటున్నారు. దీని సేకరణ కోసం పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద జరిమానా మొత్తానికి కూడా ఇదే విధానాన్ని అనుసరించవచ్చని అధికారులు తెలిపారు.
తక్కువ కాలపరిమితిలో వసూలు చేయగలిగేవి…
వారసత్వ పన్ను:
1985 కాలంలో వారసత్వ విధించేవారు. ఇది సుమారు 55 శాతం వరకూ ఉంటుంది. దీన్ని మళ్లీ తీసుకురావాలనేది ఐటీ అధికారులు తెచ్చిన తక్కువ కాలపరిమితి ప్రతిపాదన.
విదేశీ భారత పౌరుల మూలధనాన్ని 10 శాతం పెంచడం:
విదేశాల్లో ఉన్న భారతీయులపై మూలధనాన్ని 10 శాతం చేయాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఇది 30 శాతంగా ఉంది.
ఈక్వలైజేషన్ పన్నును హేతుబద్ధీకరించడం:
2016 ఫైనాన్స్ యాక్ట్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. నాన్-రెసిడెంట్ బిజినెస్‌పై ఇలాంటి పన్ను విధిస్తారు. ప్రస్తుతం ఇది 6 శాతం ఉంది. అడ్వర్టైజ్‌మెంట్ స్పేస్ అండ్ సర్వీసెస్ వంటి సంస్థలపై ఈ పన్ను అమలవుతోంది.
అలాగే, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జూమ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వినియోగం పెరుగుతున్నందున..ఇలాంటి వాటిపై డిజిటల్ మార్గంలో పన్ను విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ఐటీ అధికారులు సూచించారు.
స్వచ్చందంగా వదులుకోవడం:
సంపన్నులను గ్యాస్ సబ్సిడీ గ్యాస్‌ను వదులుకోవాలని విజ్ఞప్తి చేసినట్లుగా… కొన్ని పన్ను పన్ను మినహాయింపులను వదులుకునేలా కేంద్ర సంపన్నులను కోరాలని అధికారులు సూచించారు. అంటే, 80సీ కింద వచ్చే మినహాయింపులను రద్దు చేసుకోవాలని కోరనున్నట్టు తెలుస్తోంది.
Tags: Coronavirus, Economy, Income Tax, Investing, central, CBDT, IRS officers