- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఇతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయాలి : చెరుకు
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలో కాంగ్రెస్ఉన్నా, బీజేపీ ఉన్నా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని, అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అన్యాయంగా ప్రవర్తిస్తోందని, విద్య, వైద్యం, ఉపాధితో పాటు రాష్ట్ర సంబంధ పాలనలో జోక్యం చేసుకుంటోందన్న సీఎం కేసీఆర్ ఆరోపణతో తెలంగాణ బీజేపీయేతర ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయన్నారు.
ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఉందనుకుంటే తెలంగాణ ప్రభుత్వం జవాబుదారీగా ఉండి మిగతా రాష్ర్టాలతో ఫ్రంట్ కట్టి నిజాయితీగా కొట్లాడాలని ఆయన సూచించారు. కేంద్ర మంత్రులు మెచ్చుకోగానే వాళ్లే మెచ్చుకున్నారు, మీ విమర్శలేంటని ఇక్కడి ప్రతిపక్షాలను తిట్టిపోసి, ఇప్పుడు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అంటే ఏం లాభం అని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. జీఎస్టీలో రాష్ర్టాల వాటా కోసం గట్టిగా అడగడానికి ఇన్నేండ్లు పట్టిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీ నుంచి ఆయుష్మాన్ భవ పథకానికి మారడానికి చేసిన తాత్సారం ఎంతో మంది పేదలకు స్పష్టం చేసిందన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ఢిల్లీకి వెళ్లి బేరసారాలు ముగించుకొని ఇప్పుడు హైదరాబాద్ రాగానే మోడీ, అమిత్ షాపై బరిగీసి కొట్లాడుతానంటే కేసీఆర్‌ను ఎలా నమ్మేదంటూ చురకలంటించారు.