ఏపీ ఆర్థికస్థితిపై టీడీపీ దుష్ప్రచారం చేయడం తగదు

by srinivas |
Buggana
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలపై ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ విమర్శలు చేయడమే తప్ప టీడీపీ నేతలకు వేరే పని లేదని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరకు గతంలో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు సైతం బాధ్యత లేకుండా విమర్శించడం సిగ్గుచేటన్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయలేరని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగం వృద్ధి రేటుపై తప్పుడు గణాంకాలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. 2020-21లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో ఏపీకి మూడో ర్యాంకు లభించిందని బుగ్గన చెప్పుకొచ్చారు. 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతం కాగా.. వ్యవసాయ రంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. అటు నీతి ఆయోగ్ రిపోర్టులోనూ ఏపీకి సముచిత స్థానం దక్కిందని మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాగే పేదరిక నిర్మూలనలో 5, అసమానతల తగ్గింపులో 6వ ర్యాంకు లభించినట్టు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed