తాప్సీ.. భూమి.. ఇద్దరిలో ఎవరు ఫ్రీడమ్ ఫైటర్ ?

by Shyam |
THAPSI
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పొలిటీషియన్స్, క్రికెటర్స్, లెజెండరీ యాక్టర్స్‌ రియల్ స్టోరీస్ ఆధారంగా రూపొందించిన చిత్రాలు విజయం సాధించడంతో.. అలాంటి మరిన్ని కథలు తెరరూపం దాల్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక కొన్నివారాల నుంచి 20వ శతాబ్దానికి చెందిన ఫ్రీడమ్ ఫైటర్ ఉషా మెహతా జీవిత కథను సినిమాగా మలిచేందుకు ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ట్రై చేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే.. కాంగ్రెస్ రేడియో స్థాపించేందుకు సహకారం అందించిన గాంధేయవాది ఉషా మెహతా సొంత అల్లుడు కేతన్ మెహతానే ఈ స్టోరీని డెవలప్ చేస్తున్నాడని సమాచారం.

ఈ ప్రెస్టీజియస్ బయోపిక్‌లో మెహతా రోల్ కోసం ‘సాంద్ కీ ఆంఖ్’ మూవీలో కలిసి నటించిన తాప్సీ పన్ను లేదా భూమి పెడ్నేకర్‌‌లో ఎవరినో ఒకరిని ఎంచుకునేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసిన కేతన్.. 2021 చివరిలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక కేతన్ విషయానికొస్తే.. 2005లో ‘మంగళ్ పాండే’తో పాటు ‘మాంజీ : ది మౌంటేన్ మ్యాన్’ సినిమాలు డైరెక్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed