- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాళేశ్వరం సబ్ కాంట్రాక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు నిర్మాణ కంపెనీల కార్యాలయాలు, వాటి డైరెక్టర్ల నివాసాల్లో రెండు రోజులుగా సోదాలు జరుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టు సంస్థ అయిన ‘సీ-5 ఇన్‌ఫ్రా’కు చెందిన జువ్వాడి మదన్‌మోహన్‌రావు, నిశాంత్ నివాసాలతో పాటు పౌలోమి ఎస్టేట్, బృందావన్ స్పిరిట్స్, బేగంపేటలోని మధుపాల టవర్స్, కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్తరాక్ గార్డెన్‌లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. హైదారబాద్ నగరంలో 18చోట్ల, కరీంనగర్‌లో రెండు చోట్ల ఏకకాలంలో ఇరవై బృందాలు వేర్వేరుగా సోదాలు జరిపాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాంటాక్టర్ అయిన మెగా ఇంజనీరింగ్ సంస్థపై గతంలోనే సోదాలు జరిగాయి. ఇప్పుడు సబ్ కాంట్రాక్టు తీసుకున్న సంస్థపై జరిగాయి.
బ్యాంకు రుణాలను ఎగ్గొట్టినందుకు కోస్టల్ ప్రాజెక్టుపై సోదాలు
ఆదాయపు పన్ను శాఖ అధికారులు ‘కోస్టల్ ప్రాజెక్టు లిమిటెడ్’ సంస్థపైనా, దాని సీఎండీ, డైరెక్టర్లు, గ్యారంటర్లు, ప్రమోటర్ల కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్ళలో కూడా సోదాలు చేశారు. సుమారు రూ. 4736.57 కోట్లను వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టినందున ఈ సోదాలు చేయాల్సి వచ్చిందని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు చేయాల్సి వచ్చిందని, 2013 నుంచి తీసుకున్న రుణాలను కట్టకపోవడం ద్వారా 2017 జనవరి నాటికి మొండి బకాయిలుగా పేరుకుపోయాయని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంకు తదితర బ్యాంకుల నుంచి కూడా రుణాలు తీసుకుని ఈ సంస్థ తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిందని పేర్కొంది.
ఈ సోదాల అనంతరం కోస్టల్ ప్రాజెక్టు లిమిటెడ్, దాని సీఎండీ (గ్యారంటర్ కూడా) సబ్బినేని సురేంద్ర, ఎండీ (గ్యారంటర్) గారపాటి హరిహరరావు, పూర్తికాలం డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీధర్ చంద్రశేఖరన్, పూర్తికాలం డైరెక్టర్ శరత్ కుమార్, గ్యారంటర్ రాములు, గ్యారంటర్ అంజమ్మ తదితరులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. రవి కైలాష్ బిల్డర్స్ ఎండీ, పసుపులేటి రమేష్, గోవింద్ కుమార్, వీరికి సహకరించిన పలువురు పబ్లిక్ సర్వెంట్లపై కూడా కేసులు నమోదు చేసినట్లు సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.
పది రోజుల్లో పది సంస్థలపైన ఐటీ సోదాలు
గడచిన పది రోజుల్లో తెలంగాణకు చెందిన పది సంస్థలపైన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నగరంలో ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన యశోద హాస్పిటల్స్ బ్రాంచీల్లో గత వారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా, ఆ తర్వాత సీ-5 ఇన్‌ఫ్రా, పౌలోమి ఎస్టేట్, రవి కైలాష్ బిల్డర్లు, నైస్ మెరైన్ ఎక్స్‌పోర్ట్, సూర్యశ్రీ కాష్యూ, వాంటేజ్ మెషీన్, శ్రీ బాలాజీ ట్రేడింగ్, విజయదుర్గ గ్రీన్ ఫీల్డ్ లాంటి సంస్థల్లోనూ సోదాలు జరిపారు.