- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మళ్లీ మళ్లీ చెబుతున్నా అలా జరగదు !

X
దిశ, వెబ్‌డెస్క్: మళ్లీ మళ్లీ చెబుతున్నా ఇస్రో ప్రైవేటీకరణ జరగదు, భారతీయ అంతరిక్ష రంగంలో నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుందని ఛైర్మన్ శివన్ వ్యాఖ్యానించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో కేంద్రం ప్రకటించిన సంస్కరణల అంశంపై స్పందించిన ఆయన.. ఇస్రోను ప్రైవేటీకరిస్తారంటూ వస్తున్న అపోహాలను ఆయన తోసిపుచ్చారు. గురువారం ఓ వెబినార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం సంస్కరణలు ప్రకటించగానే ఇస్రోను ప్రైవేటీకరిస్తారనే అపోహాలు వచ్చాయని, అది నిజం కాదన్నారు. అంతరిక్ష కార్యకలాపాల్లో మెరుగైన ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించేడమే సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన బిల్లు దాదాపు తుది దశలో ఉందన్న శివన్.. దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉందన్నారు.
Next Story