- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel strikes in Gaza :ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 42 మంది మృతి
న్యూఢిల్లీ: వారం రోజులుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య వైమానిక దాడులు ఇంతలో ఆగేలా లేవు. పాలస్తీనాకు చెందిన గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. ఆదివారం ఒక్క రోజే ఇజ్రాయెల్ దాడిలో 42 మంది మరణించినట్టు హమాస్ నియంత్రణలోని ఆస్పత్రివర్గాలు వెల్లడించినట్టు అల్‌జజీరా పేర్కొంది. దీంతో గాజాలో చనిపోయినవారి సంఖ్య 190కి చేరుకుంది. 2014లో గాజాపై జరిగిన యుద్ధం కంటే ప్రస్తుత హింస మరింత ప్రమాదకరంగా మారింది. పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ ఆర్గనైజేషన్ హమాస్ ముఖ్య నేత యహియా నివాసాన్ని నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ఆదివారం వివరించింది.
ఆదివారం నాటి హింసలో మరణించిన 42 మందిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులున్నారు. కనీసం 192 మంది మరణించారని, 1200 మంది గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. కనీసం మూడు బహుళ అంతస్తులను కూల్చివేసింది. ఇదిలా ఉండగా, ఈ యుద్ధం ఇంతటితో ముగిసిపోదని, పూర్తి సామర్థ్యంతో దాడులు ఇంకా కొనసాగుతాయని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గేది లేదని వివరించారు. హమాస్ నియంత్రణలోని గాజా కోసం అధిక మూల్యాన్నీ చెల్లించడానికి దేశం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. కాగా, హమాస్, ఇస్లామిక్ జిహాదిస్టుల దాడిలో ఇజ్రాయెల్ వైపున ఆదివారం పది మంది మరణించి ఉంటారని సమాచారం. కాగా, గాజాలోని అసోసియేటెడ్ ప్రెస్, అల్‌జజీరా కార్యాలయాలున్న భవనాన్ని కూల్చడంపై వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఇజ్రాయెత్ తన చర్యలను సమర్థించుకుంది. ఆ బిల్డింగ్‌లో హమాస్‌లు వినియోగిస్తున్నారని ఆరోపించింది.
ఇజ్రాయెల్, గాజాల మధ్య హింసాత్మక ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెదవి విప్పారు. ఈ ఘటనలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రెసిడెంట్ మహ్ముద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడి హమాస్‌లు వెంటనే దాడులు ఆపేయాలని ఆదేశించారు. ఇజ్రాయెల్ ప్రధానితోనూ మాట్లాడారు. టెర్రరిస్టు గ్రూపు హమాస్‌పై దాడి చేస్తూ తమ హక్కును కాపాడుకుంటున్నదని ఇజ్రాయెల్‌ను పేర్కొంటూ ఈ దేశానికే తన గట్టి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్‌లోని నగరాలు, పట్టణాలపై విచక్షణాపూరితంగా దాడులకు తెగబడటాన్ని తప్పుబట్టారు. భారత్ మాత్రం ఇరుపక్షాలు సంయమనం పాటించి దాడుల నుంచి దూరం జరగాలని అభ్యర్థించింది. ఐరాస శాశ్వత ప్రతినిధి టీఎస్ గురుమూర్తి తాజాగా ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ పౌరులే లక్ష్యంగా గాజా చేస్తున్న విచక్షణా రహిత దాడులు ఖండనార్హమైనవని, దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మహిళలు, చిన్నారులు మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో జీవిస్తున్న భారత పౌరుడు అష్కెలాన్ వైమానిక దాడిలో మరణించారని తెలిపారు.