- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శానిటైజర్ మంచిదేనా..?
దిశ ప్రతినిధి, మేడ్చల్: బడులకు వెళ్తే పుస్తకాలు, పెన్నులు ఎంత ముఖ్యమో.. ఇప్పుడు మాస్కులు, శానిటైజర్ కూడా అంతే అవసరమైంది. కరోనా బారిన పడకుండా స్డూడెంట్ ఆరోగ్యంగా ఉండాలంటే చేతులను క్లీన్ గా ఉంచుకోవాలి. పిల్లల కోసం శానిటైజర్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అయితే మార్కెట్‌లో ఎన్నో రకాల శానిటైజర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలనే సందేహాలు ఉన్నాయి. వాటిలో ఏది మంచిది..? అని తేల్చుకోవడం కష్టమే. శానిటైజర్స్ లో 60శాతం ఆల్కాహాల్ ఉంటేనే ఉపయోగమని డాక్టర్లు చెబుతున్నారు. మరి మనం తీసుకుంటున్న శానిటైజర్స్‌లో 60శాతం ఆల్కాహాల్ ఉందా..? లేదా..? శానిటైజర్ మంచిదా..? కాదా..? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి శానిటైజర్ నాణ్యత తెలుసుకోవాలంటే ఏమంత కష్టం కాదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకునే అవకాశం ఉంది.
హ్యాండ్ శానిటైజర్.. ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ కావడంతో మెడికల్, కిరాణ షాపులు, సూపర్ మార్కెట్స్ ఇలా.. ఎక్కడ చూసినా ఎట్రాక్టివ్ బాటిల్స్ లో శానిటైజర్స్ కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి రకరకాల ప్లేవర్లలో శానిటైజర్లు వచ్చేశాయి. అందులో ఏవీ నాణ్యమైనవో తెలుసుకోకుండా వాడితే వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. అయితే హ్యాండ్ శానిటైజర్ల పనితీరు చూసి మనందరం ఆశ్చర్యపోవడం జరుగుతూనే ఉంటుంది. హ్యాండ్ శానిటైజర్ కున్న డిమాండ్ దృష్ట్యా కొన్ని నకిలీ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్ లో స్వైర విహారం చేస్తున్నాయి. మరి నాణ్యమైన హ్యాండ్ శానిటైజర్ ను గుర్తించడమెలా..? అయితే తెలుసుకోండి.. ఇలా…
కావలసిన పదార్థాలు…
1. టిష్యూ పేపర్ రోల్ (టాయిలెట్ పేపర్)
2. బాల్ పాయింట్ పెన్ – ఈ టెస్ట్ కోసం వాటర్ ప్రూఫ్ బాల్ పాయింట్ పెన్ వాడొచ్చు.
3. చిన్న సర్కిల్.. డ్రా చేయడానికి ఉపయోగపడే పదార్థం. చిన్న కాయిన్ అయినా కావచ్చు లేదా శానిటైజర్ మూత అయినా సరే పనికొస్తుంది.
4. అరకప్పు గోధుమపిండి.
5. కొన్ని ప్లేట్లు అలాగే గిన్నెలు.
6. ఒక హెయిర్ డ్రయర్.
టెస్ట్ చేసే విధానం..
నలిగిపోనటువంటి టిష్యూ పేపర్ ను తీసుకుని దాన్ని చదునైన ప్రదేశంపై ఉంచండి. దానిపై ఒక బాల్ పాయింట్ పెన్ తో కాయిన్ లేదా హ్యాండ్ శానిటైజర్ మూతను ఉపయోగించి సర్కిల్ గీయాలి. సర్కిల్ గీతలు లావుగా ఉండాలి. ఇప్పుడు సర్కిల్ మధ్యలో కొన్ని చుక్కల హ్యాండ్ శానిటైజర్ లిక్విడ్ లేదా జెల్ ను వేయాలి. ఎక్కువగా శానిటైజర్ ను వేయకూడదు. దీంతో లైన్స్ ను దాటి ఆ శానిటైజర్ బయటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే మరీ తక్కువగా కూడా డ్రాప్స్ వేయొద్దు. అవసరమైనంత మేరకు శానిటైజర్ డ్రాప్స్ ను సర్కిల్ లో వేయాలి. ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్ సర్కిల్ దాటి బయటికి రావడాన్ని మీరు గమనిస్తారు. లిక్విడ్ శానిటైజర్ ఐతే వెంటనే విస్తరిస్తుంది. మరోవైపు, జెల్ రూపంలో ఉన్నదైతే కొంచెం సమయం తీసుకుంటుంది. ఈ టెస్ట్ ను మీరు నీటితో కూడా నిర్వహించొచ్చు. ఆల్కహాల్ లేని శానిటైజర్ కి అలాగే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ కి గల తేడాను మీరు క్షణాల్లో కనిపెట్టొచ్చు. ఒకవేళ శానిటైజర్ లో తగినంత మోతాదులో ఆల్కహాల్ ఉన్నట్టయితే మీరు బాల్ పెన్ తో డ్రా చేసిన లైన్ అనేది శానిటైజర్ లో కలిసిపోవడాన్ని గుర్తిస్తారు. ఈ శానిటైజర్ తోపాటు ఆ కలర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఐతే, ఒకవేళ శానిటైజర్ లో తగినంత మోతాదులో ఆల్కహాల్ లేనట్టయితే బాల్ పాయింట్ పెన్ తో డ్రా చేసిన లైన్ అనేది శానిటైజర్ లో కలిసిపోదు. శానిటైజర్ ఆ లైన్ ను దాటి స్ప్రెడ్ అవుతున్నప్పుడు కూడా ఆ లైన్ లో మార్పులేమీ ఉండవు.
ఇదెలా పనిచేస్తుంది..?
ఈ సింపుల్ టెస్ట్ అనేది పేపర్ క్రోమాటోగ్రఫీ అనే సిద్ధాంతంపై ఆధారపడింది. వాటర్ రెసిస్టెంట్ బాల్ పాయింట్ పెన్ లో ఉపయోగించే ఇంకనేది నీటిలో సులభంగా కలిసిపోదు. కానీ, ఆల్కహాల్ లో మాత్రం త్వరగా కరిగిపోతుంది. కాబట్టి, ఈ ఇంకు శానిటైజర్ తోపాటు ముందుకు కదులుతుంది. స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ శానిటైజర్ లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు ఇంకు కరగదు. కాబట్టి, లైన్ లో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోవు.
గోధుమపిండి పరీక్ష…
ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండిని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు జొన్న లేదా ఏదైనా వేరే పిండిని కూడా ఈ పరీక్ష కోసం వినియోగించొచ్చు. ఇప్పుడు మీరు పరీక్షించదలచుకున్న శానిటైజర్ ను తీసుకుని. ఆ పిండిలో ఒక టేబుల్ స్పూన్ శానిటైజర్ ను జోడించాలి. ఎక్కువగా శానిటైజర్ ను కలపొద్దు. ఇప్పుడు శానిటైజర్ తో ఆ పిండిని బాగా కలపాలి. చపాతీపిండిలా తయారుచేయాలి. ఒకవేళ మీ శానిటైజర్ లో నీటిశాతం ఎక్కువగా ఉన్నట్టయితే, ఈ పిండి చపాతీపిండిలా సులభంగా తయారవుతుంది. ఒకవేళ తగినంత మోతాదులో ఆల్కహాల్ ఉన్నట్టయితే ఈ పిండి పౌడర్ లాగానే ఉంటుంది. చపాతి పిండిలా మారదు. చివరికి, అందులో కలిపిన శానిటైజర్ ఆరిపోతుంది.
పని చేసే విధానం..
ఈ టెస్ట్ అనేది సింపుల్ ఫ్యాక్ట్ తో పనిచేస్తుంది. పిండికి నీరు తోడైతే గ్లూటెన్ తోపాటు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉబ్బుతాయి. దీంతో చపాతి పిండిలా తయారవుతుంది. మరోవైపు, ఆల్కహాల్ అనేది గ్లూటెన్ అలాగే కార్బోహైడ్రేట్స్ తో పోరాడుతుంది. వాటిని హైడ్రేట్ అవనివ్వదు. అవి జిగురుగా మారవు. కాబట్టి, పొడిలాగానే మిగిలిపోతుంది. ఈ టెస్ట్ అనేది అత్యంత సున్నితమైంది. అరవై శాతం లేదా అంతకంటే తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న శాంపిల్స్ ను ఈ టెస్ట్ ద్వారా సులభంగా గుర్తించొచ్చు.
హెయిర్ డ్రయర్ టెస్ట్ పద్ధతి…
1. ఒక టేబుల్ స్పూన్ శానిటైజర్ ను చిన్న పాత్రలోకి తీసుకోవాలి.
2. ఇంకొక పాత్రలో కొంచెం నీటిని తీసుకోవాలి.
3. హెయిర్ డ్రయర్ ను ఉపయోగించి శానిటైజర్ ను ముప్పై సెకండ్లపాటు డ్రై చేయాలి. హెయిర్ డ్రయర్ ను వేడిచేశాక ఈ పద్ధతిని ప్రారంభించాలి.
4. ఇదే పద్ధతిలో అదే ఉష్ణోగ్రతలో నీటిని కూడా డ్రై చేయడానికి ప్రయత్నించాలి.
పరిశీలన…
ఒకవేళ శానిటైజర్ లో తగినంత ఆల్కహాల్ ఉంటే, నీటికంటే త్వరగా శానిటైజర్ ఆవిరైపోతుంది.
ఇలా పనిచేస్తుంది..
ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ నీటితో పోలిస్తే చాలా తక్కువ. ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ 78డిగ్రీల సెల్సియస్ కాగా, నీటిది వంద డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ ప్రన్సిపల్ ఆధారంగా ఈ హెయిర్ డ్రయ్యర్ టెస్ట్ చేయొచ్చు.