పవన్ కు జోడిగా.. మళయాల ముద్దుగుమ్మా?

by  |
పవన్ కు జోడిగా.. మళయాల ముద్దుగుమ్మా?
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన రీ ఎంట్రీగా ‘వకీల్ సాబ్’ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పవన్ చేయబోయే మరో రెండు చిత్రాలు కూడా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక గబ్బర్ సింగ్ రిలీజై 8 ఏళ్లు పూర్తి చేసుకొన్న రోజును పురస్కరించుకొని PSPK28 సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నారని మైత్రీ మూవీస్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. పవన్, దేవీ శ్రీల జోడి ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ లతో మ్యూజిక్ ల హిట్లు సృష్టించారు. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాలో కథానాయిక గురించి ఇప్పుడో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఓ మళయాల ముద్దుగుమ్మ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబో లో వస్తున్న సినిమాలో పవన్ సరసన మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమెకు ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఒక వేళ అది నిజమైతే మానస రాధాకృష్ణ కు ఇదే తొలి తెలుగు చిత్రం అవుతుంది. కేరళలో పుట్టిన ఈ సుందరి, దుబాయ్ లో పెరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గానూ పలు చిత్రాల్లో నటించింది. మళయాలంలో హీరోయిన్ గా పదికి పైగా చిత్రాలు చేసింది. భారీ చిత్రాల్లో నటించనప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. క్యూట్ లుక్స్ తో కనిపించే ఈ తార ప్రస్తుతం ‘పరమగురు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానులు ఈ మళయాల ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

Advertisement

Next Story