- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగరా.. క్రైం నగరా!
ఓ వైపున బ్లూ కోట్స్, మరో వైపున షీ టీమ్స్ గస్తీ… అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉన్నా కరీంనగర్ క్రైంనగర్‌గా మారుతున్నదనీ, అందుకు సాక్ష్యం ఇటీవల పెరిగిన క్రైం రేటేనని కరీంనగర్ నగరవాసులు అంటున్నారు. సీసీ కెమెరాల వాడకంలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని స్మార్ట్ సిటీ కరీంనగర్‌లో నేరాలను అదుపు చేయడంలో ఖాకీలు విఫలమవుతున్నారనే చర్చ జిల్లాలో సాగుతోంది.
నిరుడు గోదావరిఖనికి చెందిన యువతిని ఓ యువకుడు బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. ప్రేమ వ్యవహారామే ఈ హత్యకు కారణం కాగా సాక్షాత్తు కలెక్టరేట్ సమీపంలోనే ఈ ఘటన జరగడం అప్పట్లో సంచలనమైంది. కొద్ది నెలల కిందట కరీంనగర్లోని రాంనగర్‌కు చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి కొడుకు లవన్ తన బర్త్ డే సందర్భంగా హంగామా చేశాడు. తన గ్యాంగ్‌తో కలిసి ఏకంగా తల్వార్ లతో రోడ్డుపై డ్యాన్స్ చేశారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై గ్యాంగ్ తిరగబడింది. ఇటీవల ఓ గ్యాంగ్ రాంనగర్ సమీపంలోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్‌లోకి ఓ యువకున్ని తీసుకెళ్లి బెదిరించి అతని ఫోన్ లాక్కుని చిత్రహింసలకు గురిచేసింది. ఆ యువకుడు రాంనగర్ ప్రాంత యువతిని ప్రేమించినందుకే బెదిరించాడనీ, అందుకే అతన్ని గ్యాంగ్ బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే, ఆ గ్యాంగ్‌లో ఒకరు తాను కరీంనగర్ ప్రజాప్రతినిధి పీఏ తమ్ముడినంటూ చెప్పుకుంటున్నారు. దీంతో బాధితులు స్టేషన్ మెట్లెక్కేందుకు జంకుతున్నారు. ఈ విషయం సదరు ప్రజాప్రతినిధికి తెలియడంతో అతను నేరుగా హెచ్చరించడంతో గ్యాంగ్ మెంబర్స్ పరారీలో ఉన్నారు. ఇలాంటి గ్యాంగులు కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా విద్యానగర్‌కు చెందిన రాధిక అనే ఇంటర్ విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నా ఇంతవరకూ పోలీసులకు ఎలాంటి క్లూ మాత్రం లభించలేదు.
వెలుగులోకి రానివెన్నో..
వెలుగులోకి వచ్చిన ఘటనల పట్ల పోలీసులు శ్రద్ధ వహించడం లేదన్న విమర్శలున్న నేపథ్యంలో వెలుగులోకి రాని ఘటనల పరిస్థితి ఏంటి..అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది యువకులు గ్యాంగ్‌లుగా ఏర్పడి అమ్మాయిలను వేధించడం, ప్రేమికులను బెదిరించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గ్యాంగ్‌ల చేతికి చిక్కిన వారిలో అమ్మాయిల తల్లిదండ్రులేమో తమ పరువు రోడ్డుకెక్కుతుందని పోలీసులను ఆశ్రయించడం లేదు. యువకులేమో పోలీసులను ఆశ్రయిస్తే తమను స్టేషన్ల చుట్టూ తిప్పుతారని భయపడుతున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారి గురించి ఎప్పటికప్పుడు పోలీసులు ఆరా తీసి కట్టడి చేయకపోవడం వల్లె ఇటీవల కాలంలో చిల్లర గ్యాంగ్ ల ఆగడాలు పెరిగిపోయాయని సమాచారం. బాధితులు నేరుగా చెప్పే ధైర్యం లేకపోవడం కూడా ఈ గ్యాంగులకు లాభిస్తున్నప్పటికీ పోలీసులు కూడా పకడ్బందీగా గస్తీ చేపట్టడంలో విఫలమవుతున్నారని వారు ఆ దిశగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని నగరవాసుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.