- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హెలెన్’గా అతిలోక సుందరి కూతురు?
ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో బయోపిక్‌లతో పాటు రీమేక్ సినిమాల జోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే 2019లో మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన చిత్రం ‘హెలెన్’ కూడా తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్‌కు సిద్ధమవుతోంది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ముత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. అన్నాబెన్ టైటిల్ రోల్ పోషించగా లాల్ ప్రధాన పాత్ర పోషించారు. తొలి చిత్రమే దర్శకుడు ముత్తుకుట్టికి మంచి పేరు తీసుకురాగా.. అన్నా బెన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇక తమిళ్‌లో గోకుల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా.. తాజాగా ఈ సినిమా బాలీవుడ్‌లోనూ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేయబోతున్నారని టాక్.
హెలెన్ ప్రధానంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు యాక్టింగ్‌కు బాగా స్కోప్ ఉన్న చిత్రం. అన్నా బెన్ ఈ రోల్‌కు 100 శాతం న్యాయం చేసింది. అప్పటికే కేవలం ఒకే ఒక్క సినిమా (కుంబలంగీ నైట్స్) చేసిన తను ఎంతో బాగా నటించి మలయాళ పరిశ్రమను తనవైపు తిప్పుకుంది. ఇక హెలెన్ చిత్ర కథ విషయానికొస్తే.. ఫారిన్ వెళ్లాలనుకునే బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ ‘హెలెన్’. ఐఈఎల్‌టీఎస్ (IELTS) ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటూ ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తుంటుంది. కానీ ఓ రోజు అనుకోకుండా రెస్టారెంట్‌లోని కోల్డ్ స్టోరేజ్‌లో ఇరుక్కుపోతుంది హెలెన్. అప్పటికే ఆ రెస్టారెంట్ మేనేజర్ తాళం వేసి వెళ్లిపోతాడు. మైనస్ 18 డిగ్రీల చలిలో హెలెన్ తనను తాను ఎలా రక్షించుకుంది? అక్కడి నుంచి తను ఎలా బయటపడింది? అన్నదే సినిమా థీమ్. హిందీలో ‘హెలెన్’ రోల్‌ను జాన్వీ కపూర్ చేస్తే మాత్రం.. కచ్చితంగా తన కెరీర్‌కు హెల్ప్ కావడంతో పాటు నటిగా తనను తాను నిరూపించుకోవచ్చని బాలీవుడ్ టాక్. మరి బాలీవుడ్‌లోకి హెలెన్ ఎప్పుడు వెళుతుంది? జాన్వీ ఇందుకు ఒప్పుకుంటుందా? తదితర విషయాలు తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.