బాలీవుడ్ హీరోతో జాన్వీ లవ్ ట్రాక్

by Shyam |
బాలీవుడ్ హీరోతో జాన్వీ లవ్ ట్రాక్
X

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నుంచి వచ్చినవి రెండే రెండు సినిమాలు. కానీ, పాపులారిటీ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఉంటుంది. యాక్టింగ్ పరంగా బెస్ట్ అనిపించుకున్న జాన్వీ.. ఈ మధ్య లవ్‌లో పడిందనేది బీటౌన్ టాక్. సినిమా సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ బిల్డింగ్ నుంచి బయటకు వస్తున్న ఈ ఇద్దరినీ ఫొటోలో బంధించేందుకు మీడియా ప్రయత్నించగా.. కెమెరా కళ్లు కప్పే ప్రయత్నంలో జాన్వీ గోడదూకి పారిపోవడం ఈ రూమర్‌‌కు మరింత బలాన్నిస్తుంది. ‘దోస్తానా 2’ కోసం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న వీరి మధ్య నిజంగా లవ్ యాంగిల్ ఇంప్రూవ్ అయిందా? లేక ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సినిమా ప్రమోషన్ కోసం జాన్వీతో ఈ పని చేయించాడా అనేది డౌట్. ఎందుకంటే గతంలో కరణ్ ఇలాంటి ప్రయోగాలే చేసి సినిమాల సక్సెస్ రేట్ పెంచుకున్నాడు. కొల్లిన్ డి కున్హా డైరెక్షన్‌లో వస్తున్న ‘దోస్తానా 2’ 2022లో రిలీజ్ కానుంది.

హార్రర్ కామెడీ ఫిల్మ్ రూహి అఫ్జానా ప్రాజెక్ట్ కూడా డీల్ చేస్తుంది జాన్వీ. హార్దిక్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. హనీమూన్లలో దెయ్యం వధువులను అపహరించడం సినిమా కథ. రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story