- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిద్రను దూరం చేసే ‘సెల్ఫ్ రివెంజ్’
దిశ, వెబ్‌డెస్క్ : జనరల్‌గా ఎవరైనా తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు. కానీ, మనకు తెలియకుండా మనమీద మనమే రివెంజ్ తీర్చుకుంటామనే విషయం చాలా మందికి తెలియదు. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొందరు మద్యపానం, ధూమపానం చేస్తుంటారు. అంతేకాదు ఫాస్ట్‌పుడ్, వేపుళ్లు, పిజ్జాలు, బర్గర్లు.. వంటి అన్‌హెల్తీ పుడ్ తీసుకుంటూ హెల్త్ పాడుచేసుకుంటారు. ఇదొక తరహా రివేంజ్ అయితే, ఇప్పుడు మరొక కొత్త సమస్య వెలుగు చూసింది. కరోనా లాక్‌డౌన్ వల్ల అది మరింత పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అదేంటంటే ‘రివెంజ్ బెడ్‌టైమ్ ప్రోకాస్టినేటింగ్’. స్మార్ట్ స్క్రీన్ ముందు గడుపుతూ రాత్రుళ్లు నిద్రపోకుండానే.. తెల్లారిపోతోంది. ఇది సెల్ఫ్ రివెంజ్‌కు సంకేతమా?
గత కొన్ని నెలలుగా.. మన ‘స్మార్ట్ తెర’(టీవీ, ల్యాపీ, కంప్యూటర్, ట్యాబ్, సెల్‌ఫోన్)లను ఎన్నిగంటలకు స్విచ్ఛాఫ్ చేసి ఉంటాం? ఏ రోజున సంపూర్ణంగా, సంతృప్తిగా నిద్రించి ఉంటాం? చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే టీవీ షోలు లేదా యూట్యూబ్ వీడియోలు చూస్తూ లేదా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో స్క్రోల్ చేస్తూ ఎప్పుడో అర్ధరాత్రి దాటాక నిద్రపోయి ఉంటాం. ఇంకొన్నిసార్లు ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్ చూస్తూ.. ఉదయం 4, 5గంటల వరకు కూడా స్మార్ట్ స్క్రీన్స్ ముందు గడిపి ఉంటాం. రోజంతా ఏవేవో పనులతో అలిసిపోయిన శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. రాత్రి పూట వేళకు నిద్రపోతేనే.. మన లైఫ్ సైకిల్ సరిగ్గా ఉండి, జీవక్రియలన్నీ సాఫీగా జరుగుతాయి. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా లైఫ్ సైకిల్ దెబ్బతింటోంది. దాని ద్వారా లేనిపోని అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. మనకు తెలియకుండానే నిద్రను త్యాగం చేస్తూ.. మన శరీరం మీద సెల్ఫ్ రివెంజ్ తీర్చుకుంటున్నాం. ఈ ఫినామిన్‌ను ‘రివెంజ్ బెడ్‌టైమ్ ప్రొకాస్టినేషన్’గా సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఇలా నిద్రను భంగం చేసే ఎన్నో ఆన్‌లైన్ పనులకు.. ‘సెల్ఫ్ కేర్, ప్రొడక్టివ్ టైమ్, సింప్లి చిల్లింగ్’ అని కొత్త అర్థాలు చెప్పుకొని.. వాటిని రీబ్రాండింగ్ చేస్తున్నాం. ఇవే కాదు ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ప్రయాణాలు వద్దంటే ‘రివెంజ్ ట్రావెల్’ చేసి, కరోనా తెచ్చుకోవడమే కాకుండా ఎంతోమందికి దాన్ని స్ప్రెడ్ చేశాం. ఈ సెల్ఫ్ రివెంజ్ పనులన్నీ చూసేందుకు బాగానే ఉంటాయి కానీ, ఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల ఒంటరితనం, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి లక్షణాలకు లోనవుతున్నారు. మానవ సంబంధాలను కూడా ఇవి ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాదు, సోషల్ మీడియా వేదికలపై ఎక్కువ సమయం గడిపేవారిలో చిరాకు, ఈర్ష్య అధికంగా కనిపిస్తుంటాయని ఓ సర్వేలో తేలింది. తన కోపమే తనకు శత్రువు అన్నట్లుగా.. ఈ సోషల్ మీడియా వినియోగం మనకు శత్రువుగా మారి, ఎన్నో విధాలుగా రివెంజ్ తీసుకుంటోంది. అందులో భాగమే ‘రివెంజ్ బెడ్‌టైమ్ ప్రొకాస్టినేషన్’.
సోషల్ మీడియా వ్యసనం ఒక మానసిక ఆరోగ్య సమస్య అని, దానికి నిపుణుల చికిత్స అవసరమని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అదే పనిగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు వాడేవాళ్లకు రాత్రిపూట సక్రమంగా నిద్రపట్టదని, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోకపోతే దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడే ప్రమాదం ఉందని కూడా పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే యూత్ ఎంతోమంది నిద్రలేమితో సతమతమవుతున్నారు.
సెల్ఫ్ రివెంజ్ నుంచి బయటపడాలంటే.. ‘రైట్ స్లీప్ టైమ్’ను ఎంచుకోవాలి. ప్రతిరోజూ తప్పకుండా అదే టైమ్‌లో నిద్రపోవాలి. దాన్నే ఓ సంప్రదాయంగా కొనసాగించాలి. పడుకునే గంట నుంచి రెండు గంటల ముందు స్మార్ట్ ఫోన్లు, టీవీ, ఇతరత్రా ఏవీ చూడకూడదు. పడుకునే ముందు ఓ పది సెకన్ల పాటు మన శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లాలి. మైండ్‌లో ఏవిధమైన ఆలోచనలు పెట్టుకోకూడదు. రాత్రి వేళ పనులన్నీ కూడా డే టైమ్‌లో, ఖాళీ సమయాల్లో పూర్తి చేయాలి.