ఏసీబీ వలలో ఇరిగేషన్ శాఖ డీఈ..

by srinivas |
ఏసీబీ వలలో ఇరిగేషన్ శాఖ డీఈ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అవినీతికి పాల్పడిన అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇరిగేషన్ శాఖలో రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న నీటిపారుదల శాఖ డీఈ మోహన్ గాంధీని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మోహన్ గాంధీని విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story