ఇర్ఫాన్ ఫ్యాన్స్ ఖుష్

by Shyam |
ఇర్ఫాన్ ఫ్యాన్స్ ఖుష్
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌ నటనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. బాలీవుడ్, హాలీవుడ్, బ్రిటిషియన్ ఫిల్మ్స్‌లోనూ నటించిన ఆయన ఏ పాత్ర చేసినా అందులో జీవించేస్తాడు అంటారు ఫ్యాన్స్. ఆకాష్ ఖురానా డైరెక్షన్‌లో వచ్చిన ‘కర్వాన్ మూవీ’తో బాలీవుడ్ ఆడియన్స్‌ను చివరగా పలకరించిన ఇర్ఫాన్.. రెండేళ్ల తర్వాత ‘ఆంగ్రేజీ మీడియం’ సినిమాతో శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కానీ క్యాన్సర్‌తో బాధపడుతున్నఇర్ఫాన్ ఖాన్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఆయన తరపున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరో వైపు ఇర్ఫాన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడన్నవార్త విన్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇర్ఫాన్ నటించిన ‘అప్నో సే బేవఫై’ సినిమా రెండేళ్లుగా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయిన ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకులు ప్రకాశ్ భలేకర్. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో ఇర్ఫాన్ పర్‌పార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయం చెప్పాలని ఉన్నా… ఇర్ఫాన్ తమతో టచ్‌లో లేడని తెలిపారు. ఇర్ఫాన్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా ఆగిపోయిందన్న తమ అభిమాన నటుడి ప్రాజెక్ట్‌ను రిలీజ్ అవుతున్నందుకు సంతోషపడుతున్నారు ఫ్యాన్స్.

Tags: Irfan Khan, Apno Se Bewafai, Angrezi Medium, Fans


👉 Read Disha Special stories


Next Story

Most Viewed