- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఆర్‌సీటీసీ నికర లాభం రూ. 151 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) 2020 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 79.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ. 150.6 కోట్లు కాగా, గతేడాది ఇది రూ. 84 కోట్లుగా నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం, 2019 డిసెంబర్‌లో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే వరుసగా 26.9 శాతం క్షీణతను నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రూ. 586.89 కోట్లు నమోదు కాగా, గతేడాది రూ. 497.74 కోట్లతో పోలిస్తే 17.9 శాతం పెరిగింది.
2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ. 715.98 కోట్లతో పోలిస్తే వరుసగా 18 శాతం పడిపోయిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. క్యాటరింగ్ ఆదాయం 2020 మార్చిలో 12 శాతం తగ్గి రూ. 236 కోట్లకు చేరుకుంది. 2019 డిసెంబర్‌లో ఇది రూ. 269 కోట్లుగా నమోదైంది. ఇక, ఐఆర్‌సీటీసీ బ్రాండ్ వాటర్ బాటిల్ రైల్ నీర్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం 13 శాతం క్షీణించి రూ. 51 కోట్లుగా నమోదైంది. ఇంతకుముందు త్రైమాసికంలో ఇది రూ. 58.6 కోట్లుగా ఉంది. ఇంటర్నెట్ టికెటింగ్ ద్వారా వచ్చే ఆదాయం 15 శాతం తగ్గి రూ. 194 కోట్లకు చేరుకుంది. అయితే, పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం 7 శాతం పెరిగి రూ. 102 కోట్లుగా నమోదైనట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఐఆర్‌సీటీసీ ఒక్కో షేరుకు రూ. 2.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.