ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నికర నష్టం రూ. 30 కోట్లు

by Harish |
ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నికర నష్టం రూ. 30 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో హైవేస్ డెవలపర్ కంపెనీ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ రూ. 30.13 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 206.62 కోట్ల ఏకీకృత లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 1,073.46 కోట్లకు తగ్గిందని, అంతకుముదు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 1,821.12 కోట్లని కంపెనీ వెల్లడించింది.

అలాగే, ఈ త్రైమాసికంలో కంపెనీ వ్యయం రూ. 994.66 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ. 1,433.95 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి చెందిన అన్ని ప్రాజెక్టులలో టోల్ వసూళ్లు 75 శాతం కోలుకున్నాయని, అలాగే నిర్మాణ విభాగంలోనూ రాబోయే నెలల్లో సాధారణ స్థితికి మారనున్నట్టు కంపెనీ ఆశిస్తోంది. తొలి త్రైమాసికంలో సుధీర్ఘకాలం లాక్‌డౌన్ అమలు కావడం వల్ల టోల్ వసూళ్లు నెమ్మదించాయని, దశల వారీగా సడలింపులు అమలు అవుతున్నందున జూన్‌లో వసూళ్లు కూడా సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నట్టు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్ర చెప్పారు.

నిర్మాణ కార్యకలాపాలు క్రమంగా బౌన్స్ అవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఉన్న విశ్వసనీయమైన ట్రాక్ రికార్డ్.. ఈ క్లిష్ట సమయాల్లో తగినంత ద్రవ్యతను కలిగి ఉండేందుకు దోహదపడిందని వీరేంద్ర తెలిపారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్(ఐఆర్‌బీ) భారత్‌లో అతిపెద్ద ప్రైవేట్ రోడ్లు, హైవేల మౌలిక సదుపాయాల డెవలపర్ సంస్థ. ఈ సంస్థ ఆస్తుల విలువ సుమారు రూ. 51 వేల కోట్లు ఉంది.

Advertisement

Next Story

Most Viewed