నా పెళ్లి ఇలా జరుగుతదని ఊహించలేదు'

by vinod kumar |
నా పెళ్లి ఇలా జరుగుతదని ఊహించలేదు
X

దిశ, వెబ్ డెస్క్: అంగరంగా వైభవంగా జరుగుతదని ఆశించాను. కానీ, ఈ విధంగా నా పెళ్లి జరుగుతదని ఊహించలేదని, అయినా కూడా ఆనందంగా ఉందని ఓ నూతన వధువు అంటోంది.

వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా ఇరాక్ లో కర్ఫ్యూ విధించారు. బహిరంగ సభలు నిషేధించారు. వివాహ మందిరాలను మూసివేశారు. అయితే.. ఇలాంటి క్లిష్ట సమయంలో నజఫ్ నగరంలో ఓ జంట పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. ఆ ఆరుగురిని అక్కడి పోలీసులే వారి వాహనాల్లో పెళ్లి జరిగే ఇంటికి తీసుకెళ్లారు. ఇలా ఆ కొద్దిమంది మధ్య పెళ్లి కార్యక్రమం పూర్తయ్యింది.

విషయమేమిటంటే.. నజఫ్ నగరానికి చెందిన అహ్మద్ ఖలీద్ అల్-ఖాబీ అనే 23 ఏళ్ల యువకుడు, రుఖయా రహీమ్ అనే యువతి గత సంవత్సరం నుంచి ప్రేమలో పడ్డారు. అయితే వీరు పెళ్లి చేసుకుందామని, అందుకు తగ్గట్టుగా ప్రణాళిక చేసుకున్నారు. కానీ, ఈలోగా కరోనా కారణంగా దేశమంతటా కర్ఫ్యూ విధించారు. దీంతో వీరు పెళ్లి చేసుకునేందుకు వీలులేకపోయింది. పెళ్లిని వాయిదా వేయడానికి ఇష్టపడని వరుడు తన ప్రియమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అందుకు మీరు సహకరించాలని భద్రతా దళాలను కోరాడు. దీంతో ఆ అధికారులు ఆ విధంగా సహకరించి వారి పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా.. ‘ నా పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగా వైభవంగా జరుగుతదని ఆశపడ్డాను. కానీ, ఇలా జరుగుతదని నేను ఊహించలేదు’ అని వధువు అక్కడి వారితో అన్నట్లు అక్కడి మీడియాలో కథనలు వెలువడుతున్నట్లు సమాచారం.

tags: wedding, iraqi couple, police, helping, six members, corona effect

Advertisement

Next Story

Most Viewed