- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Yuzvendra Chahal: నా ఫేవరెట్ ఐపీఎల్ కెప్టెన్ అతనే
న్యూఢిల్లీ : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్‌లో తన ఫేవరెట్ కెప్టెన్ అని ఆ జట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తెలిపారు. 2013లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన చాహల్.. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది నుంచి రాజస్థాన్‌కు ఆడుతున్నాడు. 2022లో రాజస్థాన్ అతన్ని రూ. 6.50 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్‌లో ఫేవరెట్ కెప్టెన్ అనే ప్రశ్నకు చాహల్.. సంజూ శాంసన్ అని బదులిచ్చాడు. అంతేకాకుండా శాంసన్‌ను ధోనీతో పోల్చాడు.
‘ఐపీఎల్‌లో సంజూనే నా ఫేవరెట్ కెప్టెన్. ధోనీలో ఉన్న పోలికలు సంజూకు చాలానే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. గతేడాది బౌలర్‌గా నేను మెరుగవ్వడానికి సంజూనే కారణం. బౌలింగ్ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. నీ 4 ఓవర్లను నీకు ఇష్టమొచ్చినట్లు వేసుకో.. అని నాతో చెబుతాడు’ అని చాహర్ చెప్పుకొచ్చాడు. గత సీజన్‌లో తొలిసారి రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించి చాహల్ 17 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
Read more: