- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాంఖెడే స్టేడియంలో సచిన్ ఫ్యామిలీ సందడి
దిశ, వెబ్ డెస్క్: అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాంఖెడే వేదికగా ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో అర్జున్ ముంబై తరపున తుది జట్టులో ఆడాడు. మ్యాచ్ కు ముందు అర్జున్‌కు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ క్యాప్ అందజేశాడు. అనంతరం తన కొడుకుతో సచిన్ ముచ్చటించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అర్జున్ ఫస్ట్ మ్యాచ్ చూసేందుకు సచిన్ ఫ్యామిలీ వాంఖెడేలో సందడి చేసింది. అర్జున్ అక్క సారా టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకుని స్టాండ్స్ లో ఆ జట్టును సపోర్ట్ చేస్తూ కనిపించింది. ఈ మ్యాచ్ కు సారథిగా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ లో తొలి ఓవర్ వేసేందుకు బంతిని అర్జున్ కు అందించాడు. అర్జున్ మొదటి ఓవర్ వేసినంత సేపు వాంఖెడే అంతా సచిన్ నామస్మరణతో మార్మోగి పోయింది.
అర్జున్ తన ఫస్ట్ స్పెల్ లో రెండు ఓవర్లు వేసి 17 పరుగులిచ్చాడు. కాగా, 2021 నుంచి ముంబై ఇండియన్స్ క్యాంప్ లో ఉంటున్న అర్జున్ నెట్ బౌలర్ గానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆ జట్టు యాజమాన్యం అతడికి తుది జట్టుకలో అవకాశం కల్పించలేదు. ఎట్టకేలకు నేటి మ్యాచ్ లో సచిన్ కొడుకుగా అర్జున్ ను ప్రపంచానికి పరిచయం చేసింది ముంబై ఇండియన్స్ జట్టు.