IPL2024: కష్టాల్లో ముంబై ఇండియన్స్

by GSrikanth |   ( Updated:2024-04-01 14:51:31.0  )
IPL2024: కష్టాల్లో ముంబై ఇండియన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా రాజస్థాన్, ముంబై మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్ చేస్తోంది. అయితే, ఇన్సింగ్స్ ప్రారంభించిన ముంబై జట్టుకు ఆదిలోనే బిగ్ షాగ్ తగిలింది. కీలకమైన ఆటగాళ్లంతా రోహిత్ శర్మ(0), నమన్ ధీర్(0), డేవాల్డ్ బ్రేవిస్(0) డకౌట్ అయ్యారు. రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఏకంగా ఈ మూడు వికెట్లు తీసి ముంబైని చావుదెబ్బ కొట్టారు. ఈ క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం ముంబై 7.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో తిలక్(22), హార్దిక్(25) ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed