- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్-17లో హైదరాబాద్ బోణీ.. ముంబైపై విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిన ఎస్‌ఆర్‌హెచ్.. ముంబై ఇండియన్స్‌పై గెలుపు ఖాతా తెరిచింది. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరదపారిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 31 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగుల భారీ స్కోరు చేసింది. క్లాసెన్(80 నాటౌట్, 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), అభిషేక్ శర్మ(63, 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్(62, 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మార్‌క్రమ్(42 నాటౌట్) సైతం సత్తాచాటాడు. అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనలో పోరాడిన ముంబై జట్టు 246/5 స్కోరు చేసింది. తిలక్ వర్మ(64, 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. టిమ్ డేవిడ్(42 నాటౌట్), ఇషాన్ కిషన్(34), నమన్ ధిర్(30), రోహిత్(26) మెరుపులు మెరిపించినప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. దీంతో లీగ్‌లో ముంబై వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.
ముంబై పోరాటం సరిపోలే
278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై జట్టు కూడా గట్టిగానే పోరాడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(34) మరో ఆలోచన లేకుండా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బాదడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో మూడు ఓవర్లలోనే ముంబై జట్టు 50 పరుగులు సాధించింది. అయితే, ఈ జోడీ దూకుడు ఎంతో సేప కొనసాగలేదు. 4వ ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ను షాబాజ్ అహ్మద్.. ఆ తర్వాతి ఓవర్‌లో రోహిత్‌ను కమిన్స్ అవుట్ చేయడంతో ముంబైకి భారీ షాక్ తగిలింది. ఆ తర్వాతి తిలక్ వర్మ(64) గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ బౌలర్లను పరుగులు పెట్టించిన అతను జట్టును వేగంగా నడిపించాడు. ఈ క్రమంలో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనికితోడు నమన్ ధిర్(30) కూడా క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. వీరి మెరుపులతో ముంబై 10 ఓవర్లలో 141/2 స్కోరుతో నిలిచి హైదరాబాద్‌కు గట్టి పోటీనిచ్చేలా కనిపించింది. అయితే, ఉనద్కత్ బౌలింగ్‌లో నమన్ ధిర్ అవుటవడంతో ఈ జోడీకి తెరపడింది. కాసేపటికే తిలక్ కూడా వెనుదిరిగాడు. 15 ఓవర్లలో 185/4 స్కోరుతో నిలిచిన ముంబైని చివరి ఐదు ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు నిలువరించారు. హార్దిక్ పాండ్యా(24) ఆచితూచి ఆడటం ముంబైని నష్టపరిచింది. మరో ఎండ్‌లో టిమ్ డేవిడ్(42 నాటౌట్) బౌండరీలతో చెలరేగినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, జయదేవ్ ఉనద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. షాబాజ్ అహ్మద్‌కు ఒక్క వికెట్ దక్కింది.
ఫోర్ల వర్షం.. సిక్స్‌ల మోత
అంతకుముందు ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు విధ్వంసమే సృష్టించారు. ఈ విధ్వంసాన్ని ఓపెనర్ ట్రావిడ్ హెడ్ మొదలుపెట్టాడు. 3వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. 5వ ఓవర్‌లో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(11) అవుటవ్వగా.. అదే ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు దంచిన అతను చూస్తుండగానే 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ధాటికి పవర్‌ప్లేలో హైదరాబాద్ జట్టు 81/1 స్కోరుతో నిలిచింది. మయాంక్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ కూడా చెలరేగాడు. చావ్లా బౌలింగ్‌లో మూడు సిక్స్‌లతో ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలుపెట్టాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో హెడ్(62) జోరుకు గెరాల్డ్ కోయ్టజి చెక్ పెట్టగా.. అభిషేక్ ఏ మాత్రం తగ్గలేదు. బౌండరీలతో రెచ్చిపోయిన అతను 10వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టి 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చావ్లా వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో అభిషేక్(63) క్యాచ్ అవుటయ్యాడు. అప్పటికి 11 ఓవర్లలో 161/3 స్కోరుతో నిలిచిన హైదరాబాద్ భారీ స్కోరుపై కన్నేసింది. అనంతరం క్లాసెన్(80 నాటౌట్), మార్‌క్రమ్(42 నాటౌట్) ఆట మొదలైంది. తొలి మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ క్లాసెన్ మరోసారి రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలతో ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు, మార్‌క్రమ్ కూడా అదే తరహాలో చెలరేగాడు. ఆఖరి ఓవర్‌లో క్లాసెన్ 21 పరుగుల పిండుకోవడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 277/3 స్కోరు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. క్లాసెన్, మార్‌క్రమ్ జోడీ నాలుగో వికెట్‌కు అజేయంగా 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ముంబై బౌలర్లలో పాండ్యా, గెరాల్డ్ కోయ్టజి, చావ్లాలకు చెరో వికెట్ దక్కింది.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 277/3(20 ఓవర్లు)
మయాంక్ అగర్వాల్(సి)టిమ్ డేవిడ్(బి)పాండ్యా 11, ట్రావిస్ హెడ్(సి)నమన్ ధిర్(బి)గెరాల్ట్ కోయ్టజి 62, అభిషేశ్(సి)నమన్ ధిర్(బి)చావ్లా 63, మార్‌క్రమ్ 42 నాటౌట్, క్లాసెన్ 80 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 19.
వికెట్ల పతనం : 45-1, 113-2, 161-3
బౌలింగ్ : క్వెనా మఫాక(4-0-66-0), పాండ్యా(4-0-46-1), బుమ్రా(4-0-36-0), గెరాల్ట్ కోయ్టజి(4-0-57-1), పీయూష్ చావ్లా(2-0-34-1), సామ్స్ ములాని(2-0-33-0)
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 246/5(20 ఓవర్లు)
రోహిత్(సి)అభిషేక్(బి)కమిన్స్ 26, ఇషాన్ కిషన్(సి)మార్‌క్రమ్(బి)షాబాజ్ 34, నమన్ ధిర్(సి)కమిన్స్(బి)జయదేవ్ ఉనద్కత్ 30, తిలక్ వర్మ(సి)మయాంక్ అగర్వాల్(బి)కమిన్స్ 64, పాండ్యా(సి)క్లాసెన్(బి)జయదేవ్ ఉనద్కత్, టిమ్ డేవిడ్ 42 నాటౌట్, రొమారియో షెఫర్డ్ 15 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11.
వికెట్ల పతనం : 56-1, 66-2, 150-3, 182-4, 224-5
బౌలింగ్ : భునేశ్వర్(4-0-53-0), జయదేవ్ ఉనద్కత్(4-0-47-2), షాబాజ్ అహ్మద్(3-0-39-1), కమిన్స్(4-0-35-2), ఉమ్రాన్ మాలిక్(1-0-15-0), మార్కండే(4-0-52-0)