- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: సన్‌రైజర్స్ సత్తాకు సవాల్.. నేడు లక్నోతో ఢీ
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. లక్నో జెయింట్స్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా.. సన్‌రైజర్స్‌కు రెండోది. ఈ రెండు జట్లు కూడా ఇదివరకు మ్యాచ్‌లో ఓటమి చవి చూసినవే. తాను ఆడిన రెండో మ్యాచ్‌లో లక్నో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. సన్‌రైజర్స్ ఇంకా ఖాతా తెరవలేదు.
లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహసిన్ ఖాన్ గాయాల బారిన పడ్డాడు. తుదిజట్టులో అతనికి చోటు దక్కే అవకాశం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో డికాక్ ఆడొచ్చు. డికాక్‌ను తుదిజట్టులోకి తీసుకుంటే మార్కస్ స్టొయినిస్‌ను తప్పించే అవకాశం ఉంది. ఓపెనర్ కైలే మేయర్స్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేసిన నేపథ్యంలో అతణ్ని పక్కన పెట్టే సాహసం చేయకపోవచ్చు.
ఆల్ రౌండర్ కేటగిరీలో స్టొయినిస్‌ను కొనసాగించదలచుకుంటే టాప్ ఆర్డర్ బ్యాటర్ దీపక్ హుడా తుదిజట్టులో చోటు కోల్పోవచ్చనే అంచనాలు ఉన్నాయి. లోయర్ ఆర్డర్‌లో నికొలస్ పూరన్, ఆయుష్ బదోని రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మార్క్ వుడ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ కీలకంగా ఉంటారని భావిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికీ.. ప్లేయర్ల నిలకడలేమి లక్నో జెయింట్స్‌ను వేధిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. దక్షిణాఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్క్‌రమ్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌కు అతనే సారథ్యాన్ని వహించే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్‌లో మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్ కీలకం. మార్క్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక తొలి మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి, అభిషేక్ వర్మ విఫలం అయ్యారు. ఈ మ్యాచ్‌లో వారు ఎలా రాణిస్తారనేది ఆసక్తి రేపుతోంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అబ్దుల్ సమద్ ధాటిగా ఆడిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్లలో వాషింగ్టన్ సుందర్ రాణించలేదు. బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సి ఉంటుంది. స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ తన దూకుడును ప్రదర్శిస్తోన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై అతను తీసుకున్న వికెట్.. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.