ఐపీఎల్-17 పూర్తి షెడ్యూల్ ఇదే

by Harish |   ( Updated:2024-03-25 16:10:05.0  )
ఐపీఎల్-17 పూర్తి షెడ్యూల్ ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదట 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బోర్డు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లతోపాటు మొత్తం 74 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 26న టైటిల్ పోరుకు చెన్నయ్ ఆతిథ్యమివ్వనుంది.

ఐపీఎల్-17కు సంబంధించి మొదట ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగే 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా బోర్డు మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగానే మ్యాచ్‌ తేదీలు, వేదికలను ఖరారు చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తేదీల్లో మ్యాచ్‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. మొదట ప్రకటించిన తొలి దశ షెడ్యూల్‌ ఏప్రిల్ 7తో ముగియనుండగా ఆలస్యం లేకుండా కొనసాగింపుగానే రెండో దశ షెడ్యూల్‌ను బోర్డు రూపొందించింది. ఏప్రిల్ 8 చెన్నయ్, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. మే 19న చివరి గ్రూపు మ్యాచ్ జరగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనుండగా.. హైదరాబాద్-పంజాబ్, రాజస్థాన్-కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. అలాగే, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల తేదీలు, వేదికలను కూడా బోర్డు ఖరారు చేసింది. మే 21న తొలి క్వాలిఫయర్, 22న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. మే 24న క్వాలిఫయర్ 2, మే 26న ఫైనల్ జరగనున్నాయి. వీటికి చెన్నయ్ వేదిక.

వేదికల జాబితాలో గువహటి, ధర్మశాల

ఐపీఎల్-17లోనూ మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదట ప్రకటించిన 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో 10 వేదికలను ఖరారు చేయగా.. తాజాగా రెండు వేదికలను చేర్చారు. ధర్మశాల, గువహటి‌ రెండేసి మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. మే 5న చెన్నయ్‌తో, మే 9న బెంగళూరుతో పంజాబ్ తలపడనుంది. మే 15న పంజాబ్‌తో, మే 19న కోల్‌కతాతో రాజస్థాన్ ఆడనుంది.

ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తి షెడ్యూల్ ఖరారైంది. ఎస్ఆర్‌హెచ్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడనుంది. అందులో హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 27న ముంబైతో, ఏప్రిల్ 5న చెన్నయ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. అలాగే, ఏప్రిల్ 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్‌తో, మే 8న లక్నోతో, మే 16న గుజరాత్‌తో, మే 19న పంజాబ్‌తో ఆడాల్సి ఉంది.

ఐపీఎల్-17 పూర్తి షెడ్యూల్ ఇదే

తేదీ జట్లు వేదిక

మార్చి 22 చెన్నయ్ vs బెంగళూరు చెన్నయ్

మార్చి 23 పంజాబ్ vs ఢిల్లీ మొహాలి

మార్చి 23 కోల్‌కతా vs హైదరాబాద్ కోల్‌కతా

మార్చి 24 రాజస్థాన్ vs లక్నో జైపూర్

మార్చి 25 బెంగళూరు vs పంజాబ్ అహ్మదాబాద్

మార్చి 26 చెన్నయ్ vs గుజరాత్ చెన్నయ్

మార్చి 27 హైదరాబాద్ vs ముంబై హైదరాబాద్

మార్చి 28 రాజస్థాన్ vs ఢిల్లీ జైపూర్

మార్చి 29 బెంగళూరు vs కోల్‌కతా బెంగళూరు

మార్చి 30 లక్నో vs పంజాబ్ లక్నో

మార్చి 31 గుజరాత్ vs హైదరాబాద్ అహ్మదాబాద్

మార్చి 31 ఢిల్లీ vs చెన్నయ్ వైజాగ్

ఏప్రిల్ 1 ముంబై vs రాజస్థాన్ ముంబై

ఏప్రిల్ 2 బెంగళూరు vs లక్నో బెంగళూరు

ఏప్రిల్ 3 ఢిల్లీ vs కోల్‌కతా వైజాగ్

ఏప్రిల్ 4 గుజరాత్ vs పంజాబ్ అహ్మదాబాద్

ఏప్రిల్ 5 హైదరాబాద్ vs చెన్నయ్ హైదరాబాద్

ఏప్రిల్ 6 రాజస్థాన్ vs బెంగళూరు జైపూర్

ఏప్రిల్ 7 ముంబై vs ఢిల్లీ ముంబై

ఏప్రిల్ 7 లక్నో vs గుజరాత్ లక్నో

ఏప్రిల్ 8 చెన్నయ్ vs కోల్‌కతా చెన్నయ్

ఏప్రిల్ 9 పంజాబ్ vs హైదరాబాద్ మొహాలి

ఏప్రిల్ 10 రాజస్థాన్ vs గుజరాత్ జైపూర్

ఏప్రిల్ 11 ముంబై vs బెంగళూరు ముంబై

ఏప్రిల్ 12 లక్నో vs ఢిల్లీ లక్నో

ఏప్రిల్ 13 పంజాబ్ vs రాజస్థాన్ మొహాలి

ఏప్రిల్ 14 కోల్‌కతా vs లక్నో కోల్‌కతా

ఏప్రిల్ 14 ముంబై vs చెన్నయ్ ముంబై

ఏప్రిల్ 15 బెంగళూరు vs హైదరాబాద్ బెంగళూరు

ఏప్రిల్ 16 గుజరాత్ vs ఢిల్లీ అహ్మదాబాద్

ఏప్రిల్ 17 కోల్‌కతా vs రాజస్థాన్ కోల్‌కతా

ఏప్రిల్ 18 పంజాబ్ vs ముంబై మొహాలి

ఏప్రిల్ 19 లక్నో vs చెన్నయ్ లక్నో

ఏప్రిల్ 20 ఢిల్లీ vs హైదరాబాద్ ఢిల్లీ

ఏప్రిల్ 21 కోల్‌కతా vs బెంగళూరు కోల్‌కతా

ఏప్రిల్ 21 పంజాబ్ vs గుజరాత్ మొహాలి

ఏప్రిల్ 22 రాజస్థాన్ vs ముంబై జైపూర్

ఏప్రిల్ 23 చెన్నయ్ vs లక్నో చెన్నయ్

ఏప్రిల్ 24 ఢిల్లీ vs గుజరాత్ ఢిల్లీ

ఏప్రిల్ 25 హైదరాబాద్ vs బెంగళూరు హైదరాబాద్

ఏప్రిల్ 26 కోల్‌కతా vs పంజాబ్ కోల్‌కతా

ఏప్రిల్ 27 ఢిల్లీ vs ముంబై ఢిల్లీ

ఏప్రిల్ 27 లక్నో vs రాజస్థాన్ లక్నో

ఏప్రిల్ 28 గుజరాత్ vs బెంగళూరు అహ్మదాబాద్

ఏప్రిల్ 28 చెన్నయ్ vs హైదరాబాద్ చెన్నయ్

ఏప్రిల్ 29 కోల్‌కతా vs ఢిల్లీ కోల్‌కతా

ఏప్రిల్ 30 లక్నో vs ముంబై లక్నో

మే 1 చెన్నయ్ vs పంజాబ్ చెన్నయ్

మే 2 హైదరాబాద్ vs రాజస్థాన్ హైదరాబాద్

మే 3 ముంబై vs కోల్‌కతా ముంబై

మే 4 బెంగళూరు vs గుజరాత్ బెంగళూరు

మే 5 పంజాబ్ vs చెన్నయ్ ధర్మశాల

మే 5 లక్నో vs కోల్‌కతా లక్నో

మే 6 ముంబై vs హైదరాబాద్ ముంబై

మే 7 ఢిల్లీ vs రాజస్థాన్ ఢిల్లీ

మే 8 హైదరాబాద్ vs లక్నో హైదరాబాద్

మే 9 పంజాబ్ vs బెంగళూరు ధర్మశాల

మే 10 గుజరాత్ vs చెన్నయ్ అహ్మదాబాద్

మే 11 కోల్‌కతా vs ముంబై కోల్‌కతా

మే 12 చెన్నయ్ vs రాజస్థాన్ చెన్నయ్

మే 12 బెంగళూరు vs ఢిల్లీ బెంగళూరు

మే 13 గుజరాత్ vs కోల్‌కతా అహ్మదాబాద్

మే 14 ఢిల్లీ vs లక్నో ఢిల్లీ

మే 15 రాజస్థాన్ vs పంజాబ్ గువహటి

మే 16 హైదరాబాద్ vs గుజరాత్ హైదరాబాద్

మే 17 ముంబై vs లక్నో ముంబై

మే 18 బెంగళూరు vs చెన్నయ్ బెంగళూరు

మే 19 హైదరాబాద్ vs పంజాబ్ హైదరాబాద్

మే 19 రాజస్థాన్ vs కోల్‌కతా గువహటి

మే 21 క్వాలిఫయర్ 1 అహ్మదాబాద్

మే 22 ఎలిమినేటర్ అహ్మదాబాద్

మే 24 క్వాలిఫయర్ 2 చెన్నయ్

మే 26 ఫైనల్ చెన్నయ్


Advertisement

Next Story

Most Viewed