CSK అభిమానికి చేదు అనుభవం? ఎక్స్‌లో పోస్ట్ వైరల్..

by Ramesh N |   ( Updated:2024-04-09 14:35:29.0  )
CSK అభిమానికి చేదు అనుభవం? ఎక్స్‌లో పోస్ట్ వైరల్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ స్టేడియంలో నిన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను తిలకించేందకు అభిమానులు భారీగా వచ్చారు. అయితే తలా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ కావడంతో ధోని అభిమానులు అతడిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే ధోనీ అభిమాని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్ట్ చేశాడు. జునైద్ అహ్మద్ అనే యువకుడు సన్‌రైజర్స్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌కు రూ. 4,500 పెట్టి టికెట్ బుక్ చేసుకున్నాడు. అతనికి జే-66 సీట్ నెంబర్ టికెట్‌పై అలాట్ చేసినట్లు ఉంది. అతడు స్టేడియంలోకి వెళ్లగా అతడికి సీట్ కనిపించకపోవడంతో షాక్‌కు గురైయ్యాడు.

దీంతో అతడు స్టేడియం సిబ్బందికి విషయం తెలియజేయగా వారు కూడా ఏమీ చేయలేకపోయారని, దీంతో మ్యాచ్ నిలబడి చూడాల్సి వచ్చిందని ట్విట్టర్ వేదికగా ఫోటోలు పోస్ట్ చేశాడు. తనకు కలిగిన అసౌకర్యానికి నష్టపరిహారంగా తిరిగి డబ్బులు పొందగలనా? అంటూ బీసీసీఐ, ఐపీఎల్, సన్‌రైజర్స్ తో పాటు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుకు ట్యాగ్ చేశారు. అయితే అతడికి తన సీట్ ఒక ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత దొరికినట్లు తెలిపాడు. సీట్లు నంబర్లు మిక్స్ చేశారని పేర్కొన్నారు. దీంతో అతడి ట్వీట్ వైరల్‌గా మారింది.

Advertisement

Next Story