- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: ఒక్క ప్లే ఆఫ్స్‌లో 84 డాట్ బాల్స్.. 42 వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ
దిశ, వెబ్‌డెస్క్: Green Campaign(పర్యావరణం పెంపొందించడానికి) పేరిట బీసీసీఐ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్‌లో అన్ని డాట్ బాల్స్‌ను కలిపి 500 మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ఒక వినూత్న కార్యక్రమానికి తెరతీశాయి. Green Campaign పేరిట ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ప్రతీ డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించాయి. బీసీసీఐ ఆలోచనను అభినందించిన స్టార్‌స్టోర్ట్స్ యాజమాన్యం గుజరాత్, సీఎస్‌కే ప్లేఆఫ్ మ్యాచ్‌లో నమోదైన డాట్ బాల్స్ స్థానంలో చెట్టు గుర్తును ఉంచేలా ప్రణాళిక రూపొందించింది.
మంగళవారం చెన్నై, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 పోరులో బౌలర్ పరుగు ఇవ్వకుండా ‘డాట్ బాల్’ వేసిన సమయంలో టీవీ స్కోరు బోర్డులో సున్నాకు బదులుగా ఒక పచ్చని మొక్క చూపిస్తూ వచ్చారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 84 డాట్‌బాల్స్ నమోదయ్యాయి. అందులో చెన్నై ఇన్నింగ్స్‌లో 34 డాట్ బాల్స్, మిగతా 50 డాట్‌బాల్స్ గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌లో వచ్చాయి. ప్రతీడాట్ బాల్‌కు 500 మొక్కలు చొప్పున 84 డాట్‌బాల్స్‌కు 42 వేల మొక్కలు నాటనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.