ఆర్సీబీకి టైటిల్ యోగం ఆ ఏడాదిలోనే.. 20 ఏళ్ల జాబితాను రివీల్ చేసిన ఏఐ

by Harish |   ( Updated:2024-04-10 15:10:43.0  )
ఆర్సీబీకి టైటిల్ యోగం ఆ ఏడాదిలోనే.. 20 ఏళ్ల జాబితాను రివీల్ చేసిన ఏఐ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ వేటలో కొన్ని జట్లు ముందుండగా.. మరికొన్ని వెనకబడ్డాయి. మిగతా సీజన్‌లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి, ఏ జట్టు గెలుస్తుందని ఇప్పుడే ఓ అంచనాకు రావడం కష్టమే. అయితే, ఈ సారి ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చెప్పేసింది. ఈ సీజన్‌తోసహా వచ్చే20 ఏళ్లలో ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలువబోయే జట్లను ఓ ఏఐ ప్లాట్‌ఫామ్ అంచనా వేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబితా ప్రకారం.. ఈ సీజన్‌లో గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుంది. వచ్చే ఏడాది చెన్నయ్, 2026లో ముంబై టైటిల్ దక్కించుకోనున్నాయి. 2027లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో టైటిల్ నిరీక్షణకు తెరపడనుంది. ఆ సీజన్‌లో హైదరాబాద్ చాంపియన్‌గా నిలువనుంది. ఆ తర్వాత 2036లో ఎస్‌ఆర్‌హెచ్ మళ్లీ టైటిల్ దక్కించుకోనుంది. ఇక, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల నెరవేరాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందే. 2029లో ఆ జట్టు విజేతగా నిలుస్తుంది. 8ఏళ్ల తర్వాత మరోసారి ఆ జట్టు టైటిల్ కైవసం చేసుకోనుంది. 2028లో పంజాబ్, 2030లో ఢిల్లీ, 2033లో లక్నో తొలిసారిగా ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలువనున్నాయి. మొత్తంగా 20 ఏళ్లలో 10 జట్లు రెండేసి సార్లు టైటిల్ దక్కించుకోనున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ. ఈ జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story