- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ మూడు వేదికలపై నిర్ణయం తీసుకుంటాం’
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్, మొహలీ, జైపూర్‌లను తప్పించారు. దీంతో ఆ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు బీసీసీఐపై గుర్రుగా ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తామని చెబుతున్నా.. ఎందుకు తప్పించారంటూ నిలదీశాయి. తాజాగా ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందించారు. అతి త్వరలోనే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆ మూడు వేదికలపై ఫ్రాంచైజీల డిమాండును పరిశీలిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలో లేదా ప్రత్యక్షంగా అయినా అహ్మదాబాద్‌లో ఈ సమావేశం నిర్వహిస్తామని బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఆ సమావేశంలోనే ఐపీఎల్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన స్పష్టం చేశారు. బ్రిజేష్ పటేల్ వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.