ఐపీఎల్ 2021 యాంకర్లు వీళ్లే.. మయాంతి మళ్లీ మిస్

by Shiva |
ఐపీఎల్ 2021 యాంకర్లు వీళ్లే.. మయాంతి మళ్లీ మిస్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 చెన్నై వేదికగా ప్రారంభమయ్యింది. ఈ సీజన్‌ను 25 చానల్స్‌లో 8 భాషల్లో ప్రసారం చేయనున్నట్లు బ్రాడ్‌కాస్టర్ ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా ప్రీ, పోస్ట్ మ్యాచ్ ప్రోగ్రామ్స్‌ను హోస్ట్ చేసే యాంకర్ల జాబితాను విడుదల చేసింది. జస్ప్రిత్ బుమ్రా భార్య సంజన గణేషన్ ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. అయితే స్టార్ యాంకర్ మయాంతి లాంగర్ మళ్లీ దూరమయ్యింది. గత సీజన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన కారణంగా ఆమె యాంకరింగ్ చేయలేకపోయారు. ఈ సీజన్ కూడా తాను బయటకు వచ్చే పరిస్థితి లేదని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు తెలుగులో హీరో నందుతో పాటు, వింధ్య విశాఖ, నేహ చౌదరి యాంకర్లుగా వ్యవహరించనున్నారు. జతిన్ సప్రు కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

మొత్తం జాబితా : కిరా నారాయణన్, జతిన్ సప్రూ, నెరోలి మీడోస్, అనంత్ త్యాగీ, సురెన్ సుందరమ్, దీరజ్ జునేజా, భావనా బాలకృష్ణన్, నష్‌ప్రీత్ కౌర్, సుహైల్ చందోక్, అనుభవ్ జైన్, రాధకృష్ణణ శ్రీనివాసన్, సంజనా గణేషన్, ముథురామన్, ఆనంద్ కృష్ణ, వింధ్య, నేహా, రీనా , కిరణ్ శ్రీనివాస, మధు, తన్య పురోహిత్

Advertisement

Next Story