- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విమానం నుంచి చేజారినా.. ఐఫోన్ పదిలమే!
దిశ, వెబ్‌డెస్క్: కొన్ని ఫిల్మీ షాట్స్ తీసేందుకు.. ఫిల్మ్ మేకర్స్ విమానం ఉపయోగిస్తుంటారన్నది తెలిసిన విషయమే. ప్రస్తుతానికి అలాంటి ఏరియల్ షాట్స్‌ను డ్రోన్స్ ఉపయోగించి తీస్తుండగా.. బ్రెజిల్‌కు చెందిన డాక్యుమెంటరీ డైరెక్టర్, ఎన్విరాన్‌మెంటలిస్ట్ ఎర్నెస్టో గాలియట్టో మాత్రం ఏరియల్ షాట్ కోసం మినీ ప్లెయిన్‌ను ఉపయోగించాడు. అయితే షూటింగ్ టైమ్‌లో తన ఐఫోన్ చేజారిపోగా, అంతెత్తు నుంచి కింద పడ్డ తన ఐఫోన్ ముక్కలైపోయిందని గాలియట్టో భావించాడు. ఆ ఫిల్మ్ మేకర్ అనుకున్నట్టుగా తన ఐఫోన్ పగిలిపోయిందా? పదిలంగా దొరికిందా?
బ్రెజిల్, రియో డి జెనిరోలోని ఓ బీచ్ దగ్గర గాలియట్టో తన డాక్యుమెంటరీ షూటింగ్ చేస్తున్నాడు. షూటింగ్ కోసం అంతా సెట్ చేసుకుని, దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో ఎగురుతున్న మినీ ప్లెయిన్ నుంచి తన ఐఫోన్‌తో వీడియోలు, ఫొటోలు తీస్తున్నాడు. అంతలోనే బలమైన గాలులు వీయడంతో ఆ ఫోన్ కిందపడింది. ఆ ఫోన్ పని అయిపోయిందని భావించిన గాలియట్టో.. తన స్నేహితుడి సలహాతో జీపీఎస్ ఆన్ చేసి వెతకడం ప్రారంభించగా, అదృష్టవశాత్తూ తన మొబైల్ దొరికింది. ఆ టైమ్‌లో తన మొబైల్ యాక్టివ్‌గా ఉండటమే కాకుండా, ఆ మొబైల్ (ఐఫోన్ 6ఎస్)కు ఎలాంటి డ్యామేజ్ జరగకపోవడం విశేషం. కేవలం మొబైల్ స్క్రీన్‌పై కొన్ని స్ర్కాచెస్ పడ్డాయి అంతే. విమానం క్యాబిన్‌లోని వీడియోలో ఈ సంఘటన రికార్డ్ కాగా, ఐఫోన్ చేజారేటప్పుడు వీడియో కెమెరా ఆన్‌లోనే ఉండటంతో అందులో కూడా రికార్డయింది. కేవలం 15 సెకన్లలో ఆ ఫోన్ నేలను తాకగా, అది కిందపడిన డైబ్బైఐదు నిమిషాల పాటు వీడియో రికార్డవుతూనే ఉందని గాలియట్టో తెలిపాడు.