Latent Viewపై భారీ అంచనాలు.. 162 శాతం లాభాలు

by Harish |
Inverstors1
X

దిశ, వెబ్ డెస్క్: paytm మాదిరిగా Latent View కూడా నష్టాలతో సరిపెడుతుందా లేదా లాభాలను ఇస్తుందా అంటూ ఇన్వేస్టర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన paytm ఆరంభంలోనే నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత వస్తున్న ipo లు ఎలా ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 23న వచ్చే లాటెంట్ వ్యూ అనలిటిక్స్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ .190 నుంచి రూ.197 వద్ద ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం (gmp)లో రూ.517 వద్ద ట్రేడ్ అవుతదని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అంటే ఈస్టాక్ 162% వద్ద లాభాలను నమోదు చేసే అవకాశం లేకపోలేదు. రూ.600 కోట్ల IPO ఆఫర్ లో 1,75,25,703 షేర్లకు 5,72,18,82,528 బిడ్లు వచ్చాయి. 850.66 రెట్లు అధికంగా సబ్ స్క్రయిబర్ లను అందుకుంది. చివరి రోజే 326.49 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం అకర్భన వృద్ధి కార్యక్రమాలకు, అనుబంధ లాటెంట్ వ్యూ అనలిటిక్స్ కార్పొరేషన్ యొక్క వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, భవిష్యత్ వృద్ధి , సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం మూలధన పెంపునకు అనుబంధ సంస్థలలో పెట్టుబడి కోసం ఉపయెగిస్తామని కంపెనీ పేర్కొన్నది. గ్రే మార్కెట్ లో 517 వద్ద ట్రేడ్ అవుతుండడంతో మంచి లాభాలు వస్తాయని ఇన్వేస్టర్స్ అంచనా వేస్తున్నారు. అందరి అంచనాలను అందుకొని మంచి లాభాలు ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే నవంబర్ 23 వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed