- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ ఎఫెక్ట్.. కదులుతున్న ‘మానేరు భూముల’ డొంక
దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మానేరు సరిహద్దు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తూ కొందరు వ్యవసాయ భూమిగా మార్చుకుంటున్నారని ‘దిశ’ లో ప్రచురితమైన ‘మానేరు మాయం’ అనే కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. నదీ పరివాహక ప్రాంతం హద్దులను ఖరారు చేయాలని మండల తహశీల్దార్ సదానందం సిబ్బందిని ఆదేశించారు. సరైన నివేదిక వచ్చాక మానేరును ఆక్రమించి ఆ భూమిని వాడుకుంటున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నివేదికను రెండు, మూడు రోజుల్లో తీసుకుంటామని వెల్లడించారు.
పట్టాలేని భూములకు విద్యుత్ సరఫరా అవుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై కూడా విద్యుత్ అధికారులు దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అనధికారికంగా విద్యుత్ సరఫరా జరుగుతున్న వాటిని వెంటనే తొలగించి తగు నివేదిక ఇవ్వాలని సిరిసిల్ల సెస్ ఎండీ తమ శాఖలోని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. మానేరు సరిహద్దు ప్రాంతంలోని భూములను ఆక్రమించినట్లు తేలితే సంబంధిత వ్యక్తుల నుంచి భూమిని రికవరీ చేయడంతో పాటు అక్రమంగా విద్యుత్ వినియోగించినందుకు విద్యుత్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మానేరును మింగేస్తున్నారు.. అధికారులు యాక్టింగ్ చేస్తున్నారు..!