కార్మికుల హక్కులను కాలరాస్తున్న… : సుదర్శన్

by Shyam |
కార్మికుల హక్కులను కాలరాస్తున్న… : సుదర్శన్
X

దిశ, మెదక్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐఎన్టీయూసీ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్షకు బైఠాయించారు. సంగారెడ్డి పట్టణంలోని ఐఎన్టీయూసీ 327 విద్యుత్ కార్యాలయంలో శుక్రవారం వివిధ కార్మిక సంఘాల నాయకులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ కార్మిక సంఘాల అడ్వైజర్ సుదర్శన్ మాట్లాడుతూ … కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి త్యాగాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు నర్సింహారెడ్డి మాట్లాడుతూ..12 గంటల పని వేళల పెంపును ఉపసంహరించుకోవాలని, కార్మిక చట్టాల రద్దు మరియు సవరణలను ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, లాక్ డౌన్ సమయంలో అసంఘటిత వలస కార్మికులకు 7.500 రూపాయలు, రేషన్ సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఈశ్వర్ ప్రసాద్, రాజయ్య, భీంరావ్ పాటిల్, ప్రసాద్, మహబూబ్ ఖాన్, సిద్ధమ్మ పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed