- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీఆర్ఎస్ నేతకు నోటీసులు.. మాజీమంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: అన్యాయాన్ని ప్రశ్నిస్తే దావా వేస్తారా అని, అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. ఇటీవల వెలువడిన గ్రూప్ -1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (BRS Leader Enugula Rakesh Reddy) చేసిన ఆరోపణలపై స్పందించిన టీజీపీఎస్సీ (TGPSC).. రాకేష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గ్రూప్1 అభ్యర్థుల తరుపున అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూనే నియంతృత్వ పాలనను కొనసాగిస్తారా?, క్రిమినల్ కేసులు అంటూ బెదిరిస్తారా? అని నిలదీశారు. ఆరోపణలు వస్తే, వాస్తవాలు బయట పెట్టాల్సింది పోయి, నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని హెచ్చరించారు. న్యాయపరంగా ఇలాంటి అక్రమ కేసులను ఎదుర్కొంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) స్పష్టం చేశారు.