డిజిటల్ వాల్యూయేషన్‌పై జోక్యం చేసుకోండి : గవర్నర్‌కు లోకేశ్ లేఖ

by srinivas |
డిజిటల్ వాల్యూయేషన్‌పై జోక్యం చేసుకోండి : గవర్నర్‌కు లోకేశ్ లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ గవర్నర్‌ బీబీ హరిచందన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన.. డిజిటల్ వాల్యూయేషన్‌పై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నియమించినకొందరి వల్ల గ్రూప్-1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ముందస్తు అధ్యయనం లేకుండా డిజిటల్ వాల్యూయేషన్‌ను ఎంచుకోవడం అనేక విమర్శలకు తావిస్తోందని లేఖలో వెల్లడించారు. ఈ అంశంపై జోక్యం చేసుకుని అభ్యర్థులకు న్యాయం చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed