- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంచిర్యాలలో నకిలీ మావోయిస్టు ముఠా గుట్టు రట్టు..
దిశ, బెల్లంపల్లి : మావోయిస్టుల పేరుతో కిడ్నాపింగ్, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను బెల్లంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ పీఎస్ ఆవరణలో రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దెరాగడి, మంచిర్యాలకు చెందిన అంజిబాబును హుందాయ్ ఐ-20 కారులో ఎక్కించుకుని మందమర్రి వైపు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరించారు. తాము మావోయిస్టు గణేశ్ దళంలో పనిచేస్తామని పరిచయం చేసుకుని రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధితుడు తొలుత 1.50వేల రూపాయలు ఇవ్వగా, ఆ తర్వాత కూడా మరిన్ని డబ్బులు చెల్లించాలని బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఈనెల 16వ తేదిన తాళ్లగురిజాల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా శుక్రవారం నేరస్తులను బెల్లంపల్లి టి జంక్షన్ వద్ద తెలుకుంట్ల భిక్షపతి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా నకిలీ దేవత విగ్రహాన్ని అసలైన బంగారంగా నమ్మించి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారన్నారు. అరెస్టైన నిందితులు వరంగల్ జిల్లా నడికుడ గ్రామానికి చెందిన తెలుకుంట్ల భిక్షపతి(45), జనగాం జిల్లా తమ్మడపల్లి గ్రామం జాఫర్ నగర్‌కు చెందిన వడ్లకొండ రాజ్ కుమార్( 27), హైదరాబాద్‌లోని రామ్ నగర్, యూసఫ్ గూడకు చెందిన మహమ్మద్ మతీన్ అలీ(34), నగరంలోని బోరబండ చెందిన మోటమర్రి ప్రదీప్ కుమార్(32), వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన రాగుల రాజశేఖర్(27), మందమర్రి మండలం తిమ్మాపూర్‌కు చెందిన తుంగ క్రాంతి కుమార్(31), వరంగల్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన పునీత్ భారతి (25), హైదరాబాద్‌లోని రామ్ నగర్ కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్(29), వరంగల్ పట్టణంలోని దేశాయిపేట చెందిన మహమ్మద్ అఫ్జల్(48)లను అరెస్టు చేయగా, రాగుల తిరుపతి, నాని పరారీలో ఉండగా, అందుగుల శ్రీనివాస్ అనే నిందితుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడన్నారు.
నిందితుల నుంచి కంట్రీ మేడ్ పిస్టల్స్ 2, 7.65 ఎంఎం లైవ్ రౌండ్ , 1,7.65 ఎంఎం ఖాళీ రౌండ్ కేస్-1, డమ్మీ పిస్టల్స్-2, ఎయిర్ గన్-1, డమ్మీ రివాల్వర్ -1, హుందాయ్ ఐ 20 కారు, యాక్టివా స్కూటీ, తల్వార్లు -2, వాకి-టాకీలు మరియు చార్జర్‌లు 4, మావోయిస్టు లెటర్ పాడ్ పేపర్స్-50, మొబైల్ ఫోన్లు-7, పాకెట్ బుక్-1, స్మాల్ నోట్ బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైన వెంటనే బెల్లంపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందుతులను పట్టుకున్నట్టు సీపీ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన బెల్లంపల్లి ఏసీపీ మహేశ్, బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్, తాల్ల గురిజాల ఎస్ఐ బి.సమ్మయ్య, నెన్నెల్ ఎస్ఐ రమాకాంత్‌లతో పాటు సిబ్బంది, సైబర్ సెల్ కానిస్టేబుల్ మైకాంత్‌లను రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఓఎస్డీ ( ఆపరేషన్స్) శరత్ చంద్ర పవర్‌లు ప్రత్యేకంగా అభినందించారు.