- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుపతిలో అనుమానిత కాల్స్ కలకలం.. ఆందోళనలో టెలికాం శాఖ!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి అనుమానిత కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఇంటర్నెట్ కాల్స్‌ను కొందరు కేటుగాళ్లు లోకల్ కాల్స్‌గా మారుస్తున్నట్లు గుర్తించారు. వీఓఐపీ కాల్స్ అనేవి మొత్తం లోకల్ కాల్స్‌గా మారిపోతున్నాయని గుర్తించిన టెలికాంశాఖ వెంటనే తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఈ పని చేస్తున్న వారు ఎవరో త్వరగా కనిపెట్టకపోతే అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని టెలికాం శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఒకవేళ కాల్స్ మారుస్తున్నది అసాంఘిక శక్తులే అయితే దేశభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్పష్టంచేసింది. గుర్తుతెలియని వ్యక్తులు చేస్తున్న పనికి టెలికాం రంగం పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ సెల్ నెంబర్లను గుర్తించిన టెలికాం శాఖ పోలీసులకు ఇచ్చింది. 9059734645, 7995672806, 7207440569, 9121929184 నెంబర్ల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. టెలికాం శాఖ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ నెంబర్లను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు.