- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ప్రారంభించిన సీజే, కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనే మొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాత్కాలిక భవనంలో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. శాశ్వత భవనం కోసం తగిన స్థలాన్ని ఇస్తామని గతంలోనే ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీజే రమణ మాట్లాడుతూ.. ఇక్కడ ఈ కేంద్రం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని సీజే వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించగానే సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. తక్కువ వ్యవధిలోనే తగినవసతులతో ఈ కేంద్రం పని చేయడం మొదలు పెట్టిందన్నారు. మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందించారు. అన్ని రకాల కేసుల్లో మీడియేషన్‌ను ఈ కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. సమయంతో పాటు ఖర్చుల్ని కూడా ఈ కేంద్రం తగ్గించగలుగుతుందన్నారు. సమస్యలకు వీలైనంత తొందరగా పరిష్కారం కనుగొనడమే ఈ కేంద్రం ప్రత్యేకత అని తెలిపారు. దేశంలో ఆర్బిట్రేషన్ మీడియేషన్ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉన్నదని, ప్రపంచవ్యాప్తంగానే ప్రాముఖ్యత ఉన్నదన్నారు. అందువల్లనే ఇది మొత్తం ప్రపంచ దృష్టినే ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా ఆవిర్భవించిందని, అనేక రంగాల్లో అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తున్నదన్నారు. ఇప్పుడు ఈ నగరాన్ని ఇలాంటి స్థాయిలో నిలబెట్టడంలో చాలా మంది కృషి ఉన్నదన్నారు. హైదరాబాద్‌ను ఎక్కువగా ప్రేమించే, అభిమానించే వ్యక్తి సీజే అని, ఈ కేంద్రం ఏర్పాటుకు ఆయన చేసిన కృషి, చూపిన చొరవ గురించి కేసీఆర్ గుర్తుచేశారు. అనేక రంగాల్లో నగరం సెంటర్ పాయింట్‌గా నిలిచిందన్నారు. ఇప్పుడు ఈ కేంద్రం ద్వారా అనేక దేశాల నుంచి మంచి గుర్తింపు, పేరు వస్తుందన్నారు. దేశ, విదేశ వివాదాలను ఈ కేంద్రం ద్వారా పరిష్కరించుకోడానికి వీలవుతుందన్నారు.