- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోడ్డుపై యాక్సిడెంట్.. భయంతో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్..!

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. కాకతీయ విద్యాసంస్థల భవనం 3వ అంతస్థుపై నుంచి దూకి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. బాధితులు, కళాశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన సాయికిరణ్ కాకతీయ కళాశాల మెయిన్ క్యాంపస్ భవనం పైనుంచి దూకాడు. ఇది గమనించిన కళాశాల యాజమాన్యం విద్యార్థిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయి కిరణ్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం బైక్ పై వస్తూ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసినట్లు తెలిసింది. యాక్సిడెంట్ బాధితులు డబ్బులు డిమాండ్ చేశారు అని సమాచారం. ఆ భయంతోనే భవనంపై నుంచి దూకినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సాయికిరణ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.