- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లగ్గం ఆడ, భోజనం ఈడ.. భైంసా పట్టణంలో విన్నూత్న వివాహం
దిశ, ముధోల్: పెళ్లంటే నూరేళ్ళ పంట. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక అద్భుత ఘట్టం. బంధువులు, స్నేహితులు, పచ్చ తోరణాలు, డప్పులు ఇవేమి లేకుండా ఒక పెళ్లిని ఉహించుకోలేము. కానీ కరోనా మహమ్మారితో ఇవన్నీ మారిపోయాయి. ఈ కరోనా వలన ఇంట్లో నాలుగు గోడల మధ్యనే జరుగుతున్నాయి పెళ్లిళ్లు. ఇక తాజగా ఒక జంట తమ పెళ్లిని అమెరికాలో చేసుకొని, సొంత గ్రామంలో భోజనాలు పెట్టుకున్నారు. అదేం విచిత్రం అనుకుంటున్నారా..?
నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ప్రకాష్ రెడ్డి-జ్యోతిల కూతురుతో మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన నారాయణ్ రెడ్డి-లక్ష్మి కుమారుడితో వివాహం కుదిరింది. రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లారు. ఇంతలో కరోనా అడుగుపెట్టింది. అమెరికా నుంచి మన దేశానికి అనుమతి లేదు.. కరోనా కారణంగా మన దేశానికి వచ్చేందుకు అనుమతి లేదు. విమాన ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో రాకపోకలు లేక ఆ జంట ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాము ఇక్కడే పెళ్లిచేసుకుంటామని, పెళ్లి వేడుక మాత్రం తల్లిదండ్రుల సమక్షంలో జరపాలని కోరారు. ఇదే విధంగా శనివారం రాత్రి ఈ జంట అమెరికాలో పెళ్లి చేసుకున్నారు.. స్నేహితులు, సన్నిహితులు, కుటుంబీకులు ప్రొజెక్టర్ సహాయంతో ఆన్ లైన్ లో వివాహాన్ని వీక్షించారు. పెళ్లి అక్కడ జరుగగా.. వచ్చిన వారికి భోజనం ఇక్కడ ఆరెంజ్ చేశారు. ప్రస్తుతం ఈ వివాహం స్థానికంగా వైరల్ గా మారింది.