- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓట్ల కోసం రాజకీయ నేతలు కొత్త స్టంట్లు
దిశ వెబ్‌డెస్క్: ఎన్నికలకు ముందు ఒక రాజకీయ నాయకుడు కూడా రోడ్డుపైకి రాడు. కానీ ఎన్నికలు వస్తే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి పొలిటీషియన్ మీ గల్లీలో వాలిపోతాడు. ఓట్ల వేయండి అంటూ చేతులు పట్టుకుంటారు. డప్పుల చప్పుళ్లతో ప్రతి ఇంటికి తిరుగుతూ ఓట్లు కోసం నానా పాట్లు పడతారు. ఇక ఎన్నికల వేళ హడావుడి, హంగామా మాములుగా ఉండదు. నేతలు, కార్యకర్తల హడావుడి, బహిరంగ సభలతో ఎన్నికలు కోలాహాలంగా జరుగుతాయి.
ప్రస్తుతం దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా.. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని షూరూ చేశాయి. అగ్రనేతలందరూ ప్రచారంలో ముగిపోయారు. ప్రచారంలో భాగంగా నానా పాట్లు పడుతూ కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నారు. ఈ స్టంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలర్లతో కలిసి రాహుల్ చేపల వేటకు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక తమిళనాడులో స్కూల్ విద్యార్థులతో రాహుల్ గాంధీ ఆడిపాడిన వీడియోలతో పాటు ఒంటిచేత్తో పుషప్స్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ స్టంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఎలక్ట్రిక్ స్కూటీ నడుపుతుండగా.. ఆమె వెనుక కూర్చోని సచివాలయానికి వెళ్లారు. ఇక అసోంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూలీలతో కూర్చోని ప్రియాంకా గాంధీ తేయాకు తెంచారు. ఇలా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు చేస్తున్న స్టంట్లు చర్చనీయాంశంగా మారాయి.