గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్తకు ప్రమాదం.. హాస్పిటల్లో చేరిక

by Shyam |   ( Updated:2021-05-17 01:36:52.0  )
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్తకు ప్రమాదం.. హాస్పిటల్లో చేరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జాన్సన్ ప్రమాదానికి గురయ్యారు. శనివారం లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న షూటింగ్ సెట్ లో ఆయన ప్రమాదానికి గురయినట్లు తెలుస్తుంది. స్వల్ప గాయాలపాలైన నిక్ ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఆదివారం నిక్ ని డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సన్నహిత వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం నిక్, ప్రియాంక ఇద్దరు తమ కున్న సినిమా కమిట‌్‌మెంట్స్ కారణంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిక్ తన రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొంటున్నాడు. ఇక తగిలిన గాయాలతోనే నిక్ సోమవారం షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed