- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల నిర్లక్ష్యం.. వ్యాక్సిన్ ఉంది.. సిరంజీలు లేవు..!
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సినేషన్ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశం అయింది. చంపాపేట్‌లోని కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌లో సరిపడా టీకాలు ఉన్నప్పటికీ సిరంజీల కొరత ఏర్పడింది. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో నుంచి సిరంజీలు తీసుకొచ్చిన వారికి మాత్రమే సిబ్బంది టీకా వేశారు. దాదాపు 1500 మందికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఉన్నప్పటికీ.. సిరంజీలు లేకపోవడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యానికి సిరంజీల కొరత నిదర్శనం అంటూ అక్కడి స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా తప్పనిసరి అని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా.. అధికారులు కనీసం సిరంజీలు అందుబాటులో ఉన్నాయో లేదో పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story