భారత్ చైనా దారిలో వెళ్లే ప్రమాదం ఉంది : ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో

by Shamantha N |
Infosys ex-CFO V.Balakrishnan
X

న్యూఢిల్లీ: కొత్త ఐటీ చట్టాలు యూజర్ల ప్రాథమిక హక్కు గోప్యతను హరించేలా ఉన్నాయని, అలాగే, ప్రభుత్వ అధికారుల చేతికి హద్దులేని హక్కులను సమకూర్చిపెట్టేలా ఉన్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వీ.బాలక్రిష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ఎకోసిస్టమ్‌లో భారత్ ఒకటని, కానీ, ఇక ముందు చైనా దారిలో వెళ్లే ప్రమాదముందని ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో దాడులు, ఫేక్ న్యూస్ కట్టడికే చట్టాలు తెచ్చినట్టు ప్రభుత్వ ప్రకటనలను తీసుకురాగా, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ 180 దేశాల్లో 142వ స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. గతకొన్నాళ్లుగా దేశంలోని స్వతంత్ర సంస్థలు బలహీనమైన వైనాన్ని చూశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతున్నదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed