- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాస్‌ప్లేలో క్యాట్స్.. సూపర్ హీరోల్లా ఫోజులు
దిశ, వెబ్‌డెస్క్ : కాస్ ప్లే.. పాశ్చాత్య దేశాల్లో జనాలు పెద్దసంఖ్యలో పాల్గొనే ఓ ఫెస్టివల్. చాలామంది తమకు నచ్చిన ఫిక్షన్ క్యారెక్టర్ల కాస్టూమ్స్ ధరించి, ఈ ఫెస్టివల్‌లో పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మనుషులు మాత్రమే కాకుండా తమ పెట్స్ కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో పాల్గొంటే ఎలా ఉంటుంది? సూపర్ హీరో డ్రెస్‌లో ఓ పిల్లి ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆలోచనలకు కార్యరూపమిస్తూ పిల్లులకు సైతం సూపర్ ఫిట్ ట్రెండీ డ్రెస్సులు తయారు చేస్తున్నాడో వ్యక్తి. ఎక్కడంటే..
ఇండోనేషియాకు చెందిన ఫ్రెడీ లుగీన.. స్కూల్ టీచర్ నుంచి టైలర్‌గా మారాడు. ఈ క్రమంలోనే ఫ్యాషన్ రంగంలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఫ్రెడీ.. సంప్రదాయక ఇస్లాం హిజాబ్, నర్సు డ్రెస్సులు, కాస్‌ప్లే క్యారెక్టర్లు, అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘థోర్’, సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్స్ తయారు చేస్తున్నాడు. పెంపుడు జంతువుల యజమానులకు ఫ్యాషన్ డ్రెస్సులు సప్లై చేస్తూ కొత్తరకమైన లాభదాయక మార్కెట్‌ను సృష్టించుకున్నాడు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ వ్యాపారం ద్వారా నెలకు 3 మిలియన్ రూపియా (రూ.15,582) సంపాదిస్తూ తన బిజినెస్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. కాగా టీచర్ జాబ్ మానేసిన తర్వాత రకరకాల వ్యాపారాలు చేసిన ఫ్రెడీ.. తన కజిన్ ఇచ్చిన ఐడియాతో పిల్లులకు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తయారు చేయడం మొదలుపెట్టినట్టు వెల్లడించాడు.
ఇక తన పిల్లి ‘సోగన్’ కోసం ఇప్పటి వరకు 30 కాస్ట్యూమ్స్ కొనుగోలు చేసినట్లు ఫ్రెడీ రెగ్యులర్ కస్టమర్ అయిన రిస్మ్ వెల్లడించాడు. కాస్‌ప్లేలో లాగా కాస్ట్యూమ్స్ వేసుకున్న తన పెంపుడు పిల్లి సోగన్ ఫొటోలకు సోషల్ మీడియాలో 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారని, ఫన్ కోసమే ఈ డ్రెస్సులు వేస్తున్నట్లు చెప్పడం విశేషం.