- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ నష్టాలను నమోదు చేశాయి. గత 9 నెలల్లో ఈ స్థాయి సింగిల్ డే నష్టాలు రావడం ఇదే మొదటిసారి. అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. ఇది సాధారణమే అయినప్పటికీ దేశీయ మార్కెట్లు పతనమవడానికి ఇదే ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 3 శాతానికిపైగా నష్టపోయాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,939.32 పాయింట్లు పతనమై 49,099 వద్ద ముగిసింది. నిఫ్టీ 568.20 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలు తీవ్రంగా 5 శాతం మేర కుప్పకూలాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అన్ని షేర్లు పతనమవ్వగా, ఓఎన్‌జీసీ, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు అత్యధికంగా 5 శాతానికిపైగా పడిపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.70 వద్ద ఉంది. ‘అమెరికాలో పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. అంతేకాకుండా యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా మార్కెట్ల పతనానికి కారణమని’ రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ రీసెర్చ్ వైస్-ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.