నిత్యావసరాల సరఫరాకు సిద్ధం!

by  |
నిత్యావసరాల సరఫరాకు సిద్ధం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభమై రెండు వారాలు గడిచింది. ఇప్పటికే అనేక రకాలుగా నష్టాలను చూస్తున్న వినియోగదారు వస్తువుల కంపెనీలు సరఫరా విషయంలో కొంత సడలింపు కోరుతున్నారు. కనీస అవసరాల సంస్థలు, ఎఫ్ఎమ్‌సీజీ సంస్థలు, హైజీన్ ఉత్పత్తుల తయారీదారులు పరిస్థితులు మెరుగుపడతాయనే నమ్ముతున్నారు. ఉత్పత్తి, రవాణా సమస్యలతో లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయామంటూ పలు కంపెనీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించాయి.

ఇప్పటికే అనేక కర్మాగారాలు వాటి ఉత్పత్తి సామర్థ్యం 40 శాతానికి క్షీణించాయని చెబుతున్నాయి. గోడౌన్‌లలోని సరుకు నెమ్మదిగా మార్కెట్లకు చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సమర్థవంతమైన తయారీతో పాటు, సరఫరా విషయంలో తీసుకున్న జాగ్రత్తల వల్ల గడిచిన ఏడు రోజులతో పోలిస్తే ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుందని కంపెనీల వారు భావిస్తున్నారు. చాలా కంపెనీలు అత్యవసరమైన ఉత్పత్తులనే అధికంగా తయారు చేయడంపై దృష్టి సారించాయి. ఇదే సమయంలో ప్రీమియమ్ ఉత్పత్తులను తగ్గించాయి. పలు కంపెనీలు నేరుగా దుకాణాల వారితో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ దీర్ఘకాలికంగా ఉండేలా ప్రణాళికలను ప్రారంభిస్తున్నారు.

Tags : coronavirus, COVID-19, essential goods, Logistics, supply chain



Next Story